paramarsha yatra
-
పరామర్శ యాత్ర సక్సెస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర విజయవంతమైంది. జుక్కల్ నియోజకవర్గంపిట్లం నుంచి గురువారం మొదలైన రెండో విడత పరామర్శ ఎల్లారెడ్డి నియోజకవర్గం పోతంగల్ కలాన్‌లో శుక్రవారం ముగిసింది. దీంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో చేపట్టిన పరామర్శ యాత్ర పూర్తయినట్లు అయ్యింది. మొత్తం 55 రోజులు 8,510 కిలోమీటర్లు తిరిగిన ఆమె 310 మందిని పరామర్శించగా.. శుక్రవారం పోతంగల్ కలాన్‌లో మంగలి నారాయణ కుటుంబాన్ని పరామర్శించడంతో యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా గురు, శుక్రవారంలు రెండు రోజులు జిల్లాలో పర్యటించిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఆమె ఎదురేగి పిల్లలు, పెద్దలు, వృద్ధుల వయోబేధం లేకుండా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు, బోనాలు, సాంప్రదాయ నృత్యాలతో స్వాగతించారు. యాత్ర సాగింది ఇలా.. జిల్లాలో షర్మిల రెండు రోజుల పరామర్శ యాత్ర గురు, శుక్రవారం రెండు రోజులు సాగింది. చాలా చోట్ల రహదారుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో షెడ్యూల్లో కొద్దిపాటి మార్పులు జరిగినా.. అనుకున్న ప్రకారం రెండో విడతలో ఏడు కుటుంబాలను ఆమె పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా నారాయణఖేడ్, నిజాంపేట్, మాసన్పల్లి మీదుగా పిట్లం వద్ద జిల్లాలోకి చేరుకున్నారు. మొదటి రోజు పిట్లం మండలం చిల్లర్గిలో బట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. అనంతరం జుక్కల్ మండల కేంద్రంలో మేదరి శిఖామణి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి బీర్కూరు మండలం దుర్కిలో కుర్మ విఠల్, పాతవర్నిలో ఏలూరు సాయులు కుటుంబాలను పరామర్శించిన ఆమె వర్నిలో గురువారం రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కోటగిరి మండలం పోతంగల్‌కు చేరుకున్న షర్మిల, అక్కడ గౌరు నడిపి వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గాంధారి మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లి నీరడి పోచయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత చివరగా పోతంగల్ కలాన్‌లో మంగలి నారాయణ కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా పోతంగల్కలాన్ గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన పైలాన్‌కు షర్మిల శంఖుస్థాపన చేశారు. అంతకంటె ముందు రాష్ర్ట, జిల్లా నాయకులతో కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల హాజరు.. ఎంత కష్టమొచ్చినా.. ఎంత నష్టం జరిగినా.. ఎంత దూరమైనా.. ఎంత మారుమూల ఉన్నా.. ప్రతీ గడపకు వెళ్లి కలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్న షర్మిల ఇందూరు ప్రజల ఆదరణను మరచిపోలేనన్నారు. పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నా సంతోషం ఈ రోజు మా సొంతమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరామర్శయాత్ర ముగించిన గాంధారి మండలం పొతంగల్ కలాన్ గ్రామ శివారులో ఇడుపులపాయలో ఉన్నట్లుగా వైఎస్సార్ ఘాట్, పైలాన్‌ను నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకరం భూమిని కొనుగోలు చేశామని, ఇక్కడ ప్రస్తుతానికి వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఇక్కడ పైలాన్‌ను నిర్మిస్తామని, పైలాన్‌పై వైఎస్సార్ కోసం మృతి చెందిన వారి పేర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పైలాన్ చుట్టూ మొక్కలను నాటి పచ్చని చెట్లను పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతవాసులకు దీవెనగా ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. పరామర్శ యాత్ర విజయవంతానికి కృషి చేసిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి భగవంత్‌రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ నిజ్జన విఠల్, శివారెడ్డి, సంగయ్య, శ్రీధర్‌గౌడ్, రాంమోహన్, నాయుడు ప్రకాష్, బల్గం రవి, గైనిగాడి విజయలక్ష్మి, రామానుజచారి, పీర్సింగ్, లక్ష్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ‘‘పరామర్శ యాత్ర విజయవంతానికి కృషి చేసిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు కృతజ్ఞతలు. అందరి ఆదరాభిమానాలు మరచిపోలేను.. జగనన్నా నల్లకాల్వల వద్ద ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు సంతోషం.. వైఎస్సార్ స్మృత్యర్థం గాంధారి మండలం పొతంగల్ కలాన్‌లో ఇడుపుల పాయలో ఉన్నట్లుగా వైఎస్సార్ ఘాట్, పైలాన్‌ను నిర్మిస్తాం.. ఈ పైలాన్‌పై వైఎస్సార్ కోసం గుండెపగిలి చనిపోరుున వారి పేర్లు ముద్రిస్తాం..’’ - పరామర్శ యాత్ర ముగింపులో షర్మిల -
షర్మిలకు పొంగులేటి అభినందనలు
గాంధారి పోతంగల్ కలాన్(నిజామాబాద్ జిల్లా): దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి వైఎస్ జగన్ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. విజయవంతంగా పరామర్శయాత్ర పూర్తి చేసిన వైఎస్ షర్మిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ప్రతి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారని తెలిపారు. పావురాలగుట్టలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పొంగులేటి చెప్పారు. -
సంతోషం మా సొంతం: షర్మిల
నిజామాబాద్: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. పావురాలగుట్టలో జగనన్న ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా నిలబెట్టుకున్నామని చెప్పారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచివుంటారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పరామర్శయాత్ర ముగిసిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధారి పోతంగల్ కలాన్ గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే... 2009లో సెప్టెంబర్ 2న ప్రజల సమస్యలను పరిష్కరించానికి రచ్చబండకు వెళుతూ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు. మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 750 మంది ఆయన వెనకాలే మృతి చెందారు ఈ రోజు వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నాయకుడు చనిపోతే ఇలా వందల గుండెలు ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదు దీన్ని బట్టే వైఎస్ఆర్ ఎంతటి గొప్ప ప్రజానాయకుడో, ఎంత మంచి వ్యక్తో అర్థవవుతోంది తండ్రి బిడ్డల అవసరాలు తీర్చినట్టుగా ప్రజలు అవసరాలు తీర్చి ముఖ్యమంత్రి పదవికి గొప్ప అర్థం చెప్పారు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారు మన, పర తేడా లేకుండా ప్రతిఒక్క వర్గానికి మేలు చేశాడు 23 జిల్లాల ప్రజల గుండెల్లో మహానేత ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు ఉచిత్ విద్యుత్ పండించే పంటలో, పేదలకు సంజీవనిగా మారిన ఆరోగ్యశ్రీలో, జలయజ్ఞంతో సాగులోకి తెచ్చిన 25 లక్షల పంట భూముల్లో ఇలా చెప్పుకుంటూ ఎన్నో పథకాల్లో వైఎస్ఆర్ జీవించే వుంటారు వైఎస్ఆర్ చనిపోయి ఆరేళ్లు అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలోనూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగడం మహానేత గొప్పతనానికి నిదర్శనం మహానేత మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని పావురాలగుట్టలో జగనన్న మాట ఇచ్చారు కొడుకు హోదాలో జగనన్న ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ రంగు పూసింది టీడీపీతో కలిసి జగనన్న మీద కేసులు పెట్టి, కష్టాలపాల్జేసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా జగనన్న సంకల్పం చెక్కు చెదరలేదు పావురాలగుట్టలో జగనన్న ఇచ్చిన మడమ తిప్పకుండా మాటను నిలబెట్టుకున్నాం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న సంతోషం ఇప్పుడు మా సొంతం అందరినీ కలిసి పరామర్శించాం. వారి అభిమానాన్ని గుర్తించాం, ధన్యవాదాలు తెలుపుకున్నాం ఓదార్పుయాత్ర, పరామర్శయాత్ర విజయవంతమవడానికి సహకరించిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు ధన్యవాదాలు గాంధారి పోతంగల్ కలాన్ వద్ద పైలాన్ పెట్టాలని నిర్ణయించాం. ఇదొక దీవెన ఉండాలన్నది మా కోరిక -
సంతోషం మా సొంతం: షర్మిల
-
వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వర్ణిమండలం రుద్రూరులో ఆమె వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కోటగిరి మండలం పాతపొట్టంగల్లో వీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు పరామర్శ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నపాలనను తిరిగి తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంది ఒక్క వైఎస్సారేనని షర్మిల గుర్తు చేశారు. -
తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల తొలిరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది. పిట్లం వద్ద షర్మిలకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా పిట్లం మండలం చిల్లర్గిలో భట్టు చిన్నబాలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం జుక్కల్ మండలకేంద్రంలో నేదరి శిఖామణి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాజన్నపాలనను తిరిగి తెచ్చుకోవాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంది ఒక్క వైఎస్సారేనని షర్మిల గుర్తు చేశారు. -
గ్రేటర్ అభివృద్ధి వైఎస్సార్ చలవే
-
గ్రేటర్ అభివృద్ధి వైఎస్ చలవే..
పరామర్శ యాత్రలో షర్మిల వైఎస్ హయాంలోనే జీహెచ్ఎంసీ ఆవిర్భావం గ్రేటర్‌ని గ్రేట్‌గా చేసి చూపించారు ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రోరైలు.. ఇలా ఎన్నో చేశారు ఐటీలోనూ వైఎస్సే మేటి తొలిరోజు ఎనిమిది కుటుంబాలకు పరామర్శ సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ స్థాయిని పెంచింది వైఎస్సార్.. ఔటర్ రింగ్‌రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, మెట్రోరైలుకు పచ్చజెండా.. ఇలా నగరాభివృద్ధి కోసం ఎన్నో చేశారు. గ్రేటర్‌ని గ్రేట్‌గా చేసి చూపించారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధి పెంచుతూ నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాలను విలీనం చేస్తూ జీహెచ్ఎంసీ ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో మహానగరాన్ని ఆనుకుని ఉన్న పల్లెలు సైతం అభివృద్ధి పట్టాలెక్కాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు షర్మిల మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ లో పరామర్శ యాత్ర చేపట్టారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల మీదుగా 80 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో షర్మిల ఎనిమిది కుటుంబాలను పరామర్శించారు. ఇంట్లో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ‘మీ కోసం మేమున్నాం..’ అంటూ భరోసానిచ్చారు. జగనన్న అందరికీ బాసటగా నిలుస్తాడని చెప్పారు. షర్మిల వెళ్లిన ప్రతిచోట ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. షాపూర్‌నగర్ చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలోనే మేటిగా.. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను గొప్ప మహానగరంగా తీర్చిదిద్దాలని వైఎస్ కలలు కన్నారని షర్మిల చెప్పారు. అందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేన్లతో 160 కి.మీ. ఔటర్‌రింగ్ రోడ్డు వేశారన్నారు. ‘‘ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తి చేశారు. మెట్రోరైలుకు పచ్చజెండా ఊపారు. వైఎస్ బతికి ఉంటే దాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించేవారు. వైఎస్ హయాంలోనే నగరంలో నీటి సరఫరా పరిస్థితి దశాదిశ మారింది. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తీసువచ్చారు’’ అని అన్నారు. మహానగర ప్రజలకు కావాల్సిన అన్నింటినీ వైఎస్సార్ సమకూర్చితే.. కొందరు మాత్రం అంతా తామే చేశామంటారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2 శాతంగా ఉంటే.. వైఎస్సార్ హయాంలో ఐటీ ఎగుమతులు 9 నుంచి 14 శాతం పెరిగాయన్నారు. వైఎస్ పథకాలను బతికించుకోవాలి దేశంలో అన్ని రాష్ట్రాలు 46 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తే మన రాష్ట్రంలో వైఎస్సార్ ఒక్కరే 46 లక్షలు కట్టించారని పేర్కొన్నారు. ఆయన బతికి ఉంటే ప్రతి పేదవాడికి రాజీవ్ గృహకల్ప ద్వారా ఇళ్లు దక్కేవన్నారు. సీఎం పదవి చేపట్టగానే వైఎస్ కనీవినీ ఎరుగని రీతిలో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళలకు పావలా వడ్డీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుపేద రోగులకు ఆరోగ్యశ్రీ, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పేదవాడిని భుజాలపై ఎత్తుకున్నారని, రైతును రాజును చేశారని, అందుకే రాజశేఖర్‌రెడ్డి రాజన్న అయ్యారని గుర్తుచేశారు. వైఎస్సార్ పథకాలను బతికించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను షర్మిల ఆప్యాయంగా పలకరించారు. తొలుత శేరిలింగంపల్లి పరిధిలోని తారానగర్‌లో దిగంబరరావు కుటుం బాన్ని పరామర్శించారు. అక్కడ్నుంచి ఆల్వి న్ కాలనీలోని సన్నిధి క్రిష్ణ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబీకులతో మాట్లాడారు. త ర్వాత కూకట్పల్లి రామాలయం సమీపంలో టీకే రణతేజ, ముసాపేట్‌లో నోముల రాజ య్య, కుత్బుల్లాపూర్‌లో సీహెచ్ వెంకటరామరాజు, షాపూర్‌నగర్ ఎన్‌ఎల్‌బీనగర్‌కు చెందిన దామా నాగేశ్వర్రావు, దూలపల్లిలో సుర కంటి రమేశ్, మౌలాలిలోని ఉల్ఫత్నగర్లో అబ్దుల్ రెహ్మాన్ కుటుంబాలను పరామర్శించారు. పరామర్శ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్ రెడ్డి, పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, జి.ధనలక్ష్మి, బీష్వ రవీందర్, ఎన్.షర్మిల సంపత్, జయశ్రీ, విష్ణుప్రియ, ఎం.వరలక్ష్మి, బనగాని రఘురామిరెడ్డి, జె.అమర్నాథ్ రెడ్డి, బి.సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
రేపటి నుంచి గ్రేటర్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, ఆదం విజయ్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 18 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని అన్నారు. మంగళవారం నాడు 8 కుటుంబాలు, బుధవారం 6వ తేదీన 8 కుటుంబాలు, శుక్రవారం 7వ తేదీన 2 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతుంది. 6వ తేదీన సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. 7వ తేదీన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర ఉంటుంది. మెదక్ జిల్లాలో సోమవారంతో పరామర్శ యాత్ర పూర్తవుతుందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, ఆదం విజయ్ తెలిపారు. -
నేడు షర్మిల రెండోరోజు పరామర్శయాత్ర
-
నేడు షర్మిల రెండోరోజు పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల.. మెదక్ జిల్లాలో పరామర్శయాత్రలో భాగంగా రెండో రోజు సోమవారం పర్యటించనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. మెదక్ జిల్లా పర్యటనలో తొలిరోజు ఆదివారం షర్మిల మూడు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించారు. సోమ, మంగళవారాల్లో మెదక్ జిల్లాలో మరో ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. షర్మిల వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులు ఉంటారు. -
మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
-
మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర ఆదివారం ఉదయం మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. తొలి రోజు మధ్యాహ్నానికి మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వర్గల్ మండలం అంబర్ పేటలో జయమ్మ, తొగుట మండలం వేములగట్టులో బాలవ్వ, కానగల్లో బలరాం కుటుంబాలను షర్మిల పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. మొత్తం జిల్లాలో 13 బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. ఒక్క పటాన్చెరు నియోజకవర్గం మినహాయించి మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ షర్మిల పరామర్శయాత్ర కొనసాగనుంది. -
పరామర్శయాత్రకు బయలుదేరిన షర్మిల
-
3 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
* మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో నాలుగురోజుల పాటు యాత్ర * వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ * యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ పిలుపు * గ్రేటర్ ఎన్నికలయ్యాక హైదరాబాద్‌లోనూ యాత్ర: శివకుమార్ సాక్షి, హైదరాబాద్: జన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆయన తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జనవరి 3 నుంచి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆమె పరామర్శ యాత్ర షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ గురువారం వెల్లడించారు. మరో ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్‌తో కలిసి లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లాలో యాత్ర జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగుతుందని తెలిపారు. ‘‘గజ్వేల్‌లో యాత్ర ప్రారంభించి జిల్లాలో 13 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. పటాన్చెరు మినహా మెదక్‌లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 5వ తేదీ నారాయణఖేడ్‌లో పెద్ద బహిరంగ సభ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం యాత్ర నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జుక్కల్ నియోజకవర్గం పిట్లంతో మొదలుపెట్టి జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. జనవరి 6 సాయంత్రం తిరిగి లోటస్‌పాండ్ చేరుకుంటారు’’ అని వివరించారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా, నిజామాబాద్‌లో కొంతమేరకు షర్మిల పరామర్శ యాత్ర ఇప్పటికే పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా,ప్రజలకిచ్చిన మాట మేరకు వైఎస్ జగన్ ఇప్పటికే కోస్తా, రాయలసీమల్లో ఓదార్పు యాత్ర చేశారని, తెలంగాణలోనూ ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్ర పూర్తి చేశారని నల్లా గుర్తు చేశారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుం బాలకు ‘మేమున్నాం’ అనే భరోసా కల్పించేందుకే షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారని శివకుమార్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో కూడా షర్మిల పరామర్శ యాత్ర ఉంటుందని తెలిపారు. షర్మిల యాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గసభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, శ్రేణులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్రా భిక్షపతి, పార్టీ జాయింట్ సెక్రటరీ సంజీవరావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరిరెడ్డి, నేతలు సిద్దిపేట జగదీశ్వర్ గుప్తా, శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
నిజామాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్ర
-
నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
-
నిజామాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన పరామర్శయాత్ర
-
రెండో రోజు ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
-
ఆదిలాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్ర
-
ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'
కరీంనగర్ : ప్రజల బాధను తన బాధగా మలుచుకున్న వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. అందుకే రాజన్నగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో ఉన్న ఆమె శుక్రవారం హుజురాబాద్, మానకొండూరులో ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు అందేదని, పేదలకు ఇళ్లు, ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదని అన్నారు. అలాగే రైతులకు 9గంటల కరెంట్ వచ్చేదని వైఎస్ షర్మిల అన్నారు. -
'ఆయన బతికుంటే ఆశావర్కర్లు రెగ్యులరైజ్ అయ్యేవారు'
ప్రతి ఒక్కరికీ మేలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదవాడి గుండెల్లో రాజన్నగా సజీవంగా ఉన్నారని వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పరామర్శ యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ మాత్రమేనని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు నీరు, పేదవాడికి ఇల్లు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేవని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలను బతికించుకుందామని, చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని, ఆయన బతికుంటే ఆశా వర్కర్లు రెగ్యులరైజ్ అయ్యేవారని వైఎస్ షర్మిల చెప్పారు. వ్యవసాయం దండగ అని కొందరు నాయకులు అన్న రోజుల్లో దాన్ని పండుగలా చేసిన మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతులు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారని ఆయన అన్నారు. రాజన్న కలలు సాకారం కావాలంటే మనమంతా ఐక్యం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు. -
ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం
-
వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం
హుజురాబాద్: రెండో రోజు కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది. హుజురాబాద్‌లోని గాంధీ చిత్రపటానికి వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. హుజురాబాద్, మానకొండూరు నియోజవర్గాల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. -
రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఈ రోజు హుజురాబాద్, మానకొండూరు నియోజక వర్గాల్లో పర్యటించి ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. హుజురాబాద్ లో యాత్ర ప్రారంభించిన షర్మిల అక్కడ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండలంలోని సిర్సపల్లి, రాంపూర్, జమ్మికుంట మండలం ధర్మారం, గండ్రపల్లిలో ఎడ్ల వెంకటనర్సు, సంచు తిరుపతి, పసుపుల మొగిలి, గాదె ఉప్పలయ్య, కుటుంబాలను కలుస్తారు. ఆ తర్వాత కేశవపట్నం, లక్ష్మీపూర్, బంజేరుపల్లిలో కాసరాజుల లక్ష్మయ్య, ఎడ్ల శ్రీనివాస్, రేణికుంట కొమురయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. -
తొలి రోజు 8 కుటుంబాలకు పరామర్శ
-
కరువు సీమలో.. కన్నీరు తుడుస్తూ...
- హుస్నాబాద్‌లో తొలి రోజు 8 కుటుంబాలకు పరామర్శ - ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే... - పంటల్లేక, అప్పులపాలై బోరున విలపించిన వైనం - అధైర్య పడొద్దంటూ ధైర్యం చెప్పిన షర్మిల - వైఎస్ తనయను అక్కున చేర్చుకున్న కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కరువు సీమగా పేరొందిన హుస్నాబాద్ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల తొలి రోజు పరామర్శ యాత్ర ఉద్విగ్నభరితంగా సాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన ఎనిమిది మంది కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాక సాగిన యాత్రలో ఏ కుటుంబాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక అయినవారు చనిపోయారనే బాధతో బతుకీడుస్తున్న వారిపై రెండేళ్లుగా కరువు పగబట్టింది. కుటుంబ పెద్దను కోల్పోయి బతుకు బండి నడపలేక సతమతమవుతున్నది కొందరైతే, కన్నపేగును కోల్పోయి దిక్కులేని పక్షులైన వారు మరికొందరు. అందరివీ రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలే. పంటలెండి, అప్పులపాలై, వాటిని తీర్చే మార్గంలేక దుర్భరంగా బతుకీడుస్తున్నామని వారంతా షర్మిలతో గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్య పడొద్దంటూ వారందరినీ ఆమె ఓదార్చారు. ‘‘మంచి రోజులొస్తాయి. మీకు అండగా మేముంటాం’ అంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన షర్మిలకు కరీంనగర్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లి వద్ద పార్టీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రేణుల డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటలతో ఘన స్వాగతం లభించింది. అక్కడినుంచి ఆమె కోహెడ మండలం వరుకోలులో పెంటపర్తి సాహితి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆస్తిపాస్తులేమీ లేని సాహితి తండ్రి రమణారెడ్డి, కూతురిని కోల్పోయి అనాథలా బతుకుతున్నానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. సాహితి కుమార్తెలిద్దరిని పలకరించిన షర్మిల, ఏం చదువుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి అక్కడినుంచి కదిలారు. కూరెల్లలో ల్యాగల లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. కోహెడలో మధ్యాహ్న భోజనం తర్వాత ధర్మసాగర్, నందారం, పోతారం, మల్లంపల్లి, కొత్తపల్లి, దామెర గ్రామాల్లో శ్రీనివాస్, అజ్మీర తుక్యానాయక్, బత్తిని ఎల్లయ్య, బూడిద లస్మమ్మ, వేల్పుల ప్రభాకర్, జక్కుల సులోచన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతి కుటుంబంతో అరగంటకు పైగా గ డిపారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు అంతా సకాలంలో వానల్లేక పంట ఎండిందని, బతుకు దెరువు కోసం వలస పోతున్నామని, ఆర్థికంగా ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు. రాత్రి 9 గంటలకు పరామర్శ యాత్ర ముగించి హుజూరాబాద్‌లో షర్మిల బస చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భీష్వ రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎల్లాల సంతోష్‌రెడ్డి, కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాస్, అక్కినపల్లి కుమార్ , వేముల శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు సెగ్గెం రాజేశ్, రాష్ట్ర యువజన కార్యద ర్శులు గోవర్దనశాస్త్రి, మంద వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు ముసుకు వెంకటరెడ్డి, డి.వేణుమాధవరావు, పి.వేణుగోపాల్‌రెడ్డి, సింగిరెడ్డి ఇందిరా భాస్కర్‌రెడ్డి, జీడికంటి శివ, సొల్లు అజయ్‌వర్మ, శంకర్, కాసారపు కిరణ్, గండి శ్యామ్, రాజమణి, పద్మ, వరంగల్ జిల్లా నాయకులు ఎం.కల్యాణ్‌రాజ్, ఎ.మహిపాల్‌రెడ్డి, సుమిత్ గుప్తా, రాజ, మెదక్ జిల్లా నాయకులు తడాకా జగదీశ్వర్‌గుప్తా, వీరరాజు, గురునాథ్, హైదరాబాద్ నగర నాయకులు ఎండీ.మజీద్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు. -
నిజామాబాద్ జిల్లా షర్మిల పరామర్శయాత్ర ఖరారు
-
అక్టోబర్ 1 నుంచి రెండో విడత పరామర్శయాత్ర
-
అక్టోబర్‌లో కరీంనగర్ రెండో విడత యాత్ర
-
అక్టోబర్‌లో కరీంనగర్ రెండో విడత యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తరఫున పరామర్శిస్తున్న ఆయన సోదరి షర్మిల... అక్టోబర్ 1వ తేదీ నుంచి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పరామర్శయాత్ర చేస్తారని ఆ పార్టీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలి పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి 3 వరకు కరీం నగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ మండలం వర్కోలులో ఈ యాత్ర ప్రారంభమవుతుందని... 3న మధ్యాహ్నం సమయానికి 18 కుటుంబాలను కలుసుకుంటారని చెప్పారు. 3న సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలోకి షర్మిల అడుగుపెడతారని చెప్పారు. ఆ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గం దిలావార్‌పూర్‌లో యాత్ర ప్రారంభించి 5వ తేదీ వరకు కొనసాగిస్తారని, పది కుటుంబాలను కలుసుకుంటారని వెల్లడించారు. 5వ తేదీన సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి 6వ తేదీ వరకు 19 కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. షర్మిల ఇప్పటివరకు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 169 కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పిం చారని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 5,114 కిలోమీటర్లు ప్రయాణించారన్నారు. -
రైతు బంధు వైఎస్సార్
కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల * ఆ మహానేత బతికి ఉంటే ఇంత మంది రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్లమా? * అన్నదాత అప్పులపాలు కావొద్దని వైఎస్ వేల కోట్ల రుణమాఫీ చేశారు * ఎరువులు, విత్తనాల ధరలు తగ్గించి మద్దతు ధర పెంచారు * వ్యవసాయాన్ని పండుగలా మార్చారు * జిల్లాలో ముగిసిన తొలి దశ యాత్ర సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘ఆ వేళ మహా నాయకుడు తిరిగి వస్తారని లక్షలాది హృదయాలు ఆశగా ఎదురు చూశాయి. కానీ మన దురదృష్టం.. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఆ ఒక్క నాయకుడు బతికి వస్తే ఈరోజు ఇంత మంది రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్లమా..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని వేల కోట్ల పంట రుణాలను వైఎస్ ఒకేసారి మాఫీ చేశారని గుర్తు చేశారు. వైఎస్ మరణంతో గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి షర్మిల గురువారం కరీంనగర్ జిల్లాలో మూడోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను పరామర్శించారు. రామభద్రునిపల్లెలో కాచి బీరయ్య, గుంజపడుగులో తూర్పాటి రాజయ్య, చిన్నాపూర్‌లో కోరెపు నర్సయ్య, కోనాపూర్‌లో పంచాల బుచ్చమ్మ, మల్లాపూర్‌లో తుకారాం గౌడ్ కుటుంబాలను పరామర్శించారు. పెగడపల్లి మండలం నామాపూర్, మల్లాపూర్ మండలం ముత్యంపేటలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఇక్కడకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి రైతుకు అండగా నిలబడి భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్సార్ అని, అప్పుల ఊబిలో ఉన్న రైతన్నకు అండగా నిలిచేందుకు ఉచిత కరెంటు ఇచ్చారని, రైతులు బకాయి పడిన విద్యుత్ రుణాలను, పంట రుణాలను మాఫీ చేశారని పేర్కొన్నారు. రైతన్నకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలనే ఆలోచనతో ఎరువులు, విత్తనాల ధరలు తగ్గిం చి, రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచారన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారని చెప్పారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. 371 కి.మీ... 12 కుటుంబాలు వరంగల్ జిల్లాలో యాత్రను ముగించుకొని కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల.. ఇక్కడ తొలిదశ యాత్రను ముగించారు. మూడు రోజుల పాటు జిల్లాలో 371 కిలోమీటర్లు పర్యటించిన షర్మిల 12 కుటుంబాలను ఓదార్చారు. పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బీష్వ రవీందర్, డాక్టర్ నగేష్, బోయినపల్లి శ్రీనివాసరావు, సెగ్గం రాజేష్, అక్కినపెల్లి కుమార్, సందమల్ల నరేష్, గోవర్ధన శాస్త్రి, సింగిరెడ్డి ఇందిర, ప్రపుల్లారెడ్డి, బ్రహ్మానందారెడ్డి, షర్మిలా సంపత్, విలియం మునిగాల, ఎల్లాల సంతోష్‌రెడ్డి, జూలి, కట్ట శివ, సంధ్యారాణి, ఎస్.అజయ్ వర్మ, అయిలూరి వెంకటేశ్వర్లు, జగదీశ్వర్ గుప్తా, ఇమామ్ హుస్సేన్, లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు రాజమ్మ, పద్మ, శ్రీనివాస్, ఎస్కే ముస్తాక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
'రుణమాఫీ ఒకేదశలో చేసిన నేత వైఎస్సార్'
కరీంనగర్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన తొలివిడత పరామర్శయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా 6 నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించి 12 కుటుంబాలను పరామర్శించారు. జిల్లాలోని మల్లాపూర్ లో తుకారంగౌడ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైతుల రుణమొత్తాలను ఒకేదశలో మాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దేనని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహానేత పెద్దపీట వేశారని, ప్రతి ఎకరాకు నీరిచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా చేసేందుకు వైఎస్సార్ కృషిచేశారని షర్మిల గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాలనలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించిన ఘనత వైఎస్సార్ సొంతమన్నారు. వైఎస్సార్ బతికుంటే ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు, ఉచిత విద్య, రైతులకు 9 గంటలు కరెంట్ అందేదని అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చుకునేందుకు చేయిచేయి కలిపి రాజన్న రాజ్యాన్ని సాధించుకుందామని షర్మిల పిలుపునిచ్చారు. మల్లాపూర్‌లో వెంకటేశం కుటుంబాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, రూ. 5వేల ఆర్ధిక సాయం అందించారు. -
1 నుంచి కరీంనగర్ జిల్లాలో మలి విడత పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అక్టోబర్ 1 నుంచి కరీంనగర్ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర చేపట్టనున్నారు. 1, 2, 3 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటిస్తారని.. 18 కుటుంబాలను పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ తెలంగాణ నేత శివకుమార్ తెలిపారు. అక్టోబర్ 3 సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా నుంచి పరామర్శయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. 3, 4, 5 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో 10 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. అక్టోబర్ 5 సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారని ఆరోజు, తర్వాత రోజు ఇక్కడ పరామర్శయాత్ర సాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో169 కుటుంబాలను షర్మిల పరామర్శించారని, 4 జిల్లాల్లో పరామర్శయాత్ర పూర్తయిందని శివకుమార్ వెల్లడించారు. -
వైఎస్సార్ ఎవరెస్టు
కరీంనగర్ పరామర్శ యాత్రలో షర్మిల * తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో వైఎస్ * వైఎస్ ఆశయ సాధనకు చేయి చేయి కలుపుదాం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దివంగత మహానేత వైఎస్సార్ ఎవరెస్టు శిఖరంలాంటి వారని, ఆయనకు మరణం లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజల గుండెలపై వైఎస్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి బుధవారం షర్మిల కరీంనగర్ జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగించారు. ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలికి భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. అధికారం ఉన్నా... లేకున్నా వైఎస్సార్ ప్రజల పక్షాన నిలబడ్డారని, అందుకే వారి గుండెల్లో రాజన్నగా బతికి ఉన్నారన్నారు. ‘‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని రుణమాఫీ చేసి ఆదుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి అండగా నిలబడ్డారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారు. అందుకే వైఎస్సార్ మరణించి ఇంతకాలమైనా ప్రజ లు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు..’’ అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను, ఆయన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం చేయి చేయి కలిపి ముందుకు సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నల కోటలో.. కాటారం, మహాదేవపూర్, కమాన్‌పూర్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వరంగల్ జిల్లా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అటవీ ప్రాంతంలోని కుటుంబాలను ఒకే చోటకు పిలిచి పరామర్శించాలని వరంగల్ డీఐజీ చేసిన సూచనను షర్మిల సున్నితంగా తిరస్కరించారు. అలా చేస్తే పరామర్శకు అర్థం ఏముంటుందన్నా అంటూ యాత్రకు పయనమయ్యారు. దట్టమైన అటవీ మార్గం మీదుగా కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ మడక సుశీల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అదే మండలం విలాసాగర్‌లోని మంచినీళ్ల కొమురమ్మ కుటుంబీకులను కలిశారు. తర్వాత కమాన్‌పూర్ మండలం కేకే నగర్లో చిలకాని హన్మంతు, సుల్తానాబాద్ మండలం చిన కల్వల గ్రామంలో కుంభం వెంకటలక్ష్మి, చొప్పదండి మండలం వెదురుగట్టులో మడ్డి రామస్వామి, ధర్మారం మండలం నర్సింహులపల్లిలో కునుకుంట్ల రాయమల్లు కుటుంబాలను పరామర్శించారు. పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ నగేష్, బీష్వ రవీందర్, బోయినపల్లి శ్రీనివాసరావు, సెగ్గం రాజేష్, అక్కినపెల్లి కుమార్, సందమల్ల నరేష్, గోవర్ధన శాస్త్రి, సింగిరెడ్డి ఇందిర, జిల్లా నాయకులు రాజమ్మ, పద్మ, ఎస్కే ముస్తాక్, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు పాల్గొన్నారు. అమ్మా... మీ ఇల్లే నా తల్లిగారిల్లు! తల్లిదండ్రులు లేని ఆ ఆడబిడ్డకు వైఎస్ కుటుంబమే తల్లిగారి ఇల్లు అయింది. ఏ తోడు లేని ఆ నిరుపేదకు వైఎస్ ఇల్లు కట్టిస్తే... పెళ్లీడుకొచ్చిన ఆ యువతికి జగన్ డబ్బు పంపి పెళ్లి చేయించారు. ఇప్పుడు నిండు గర్భిణిగా ఉన్న ఆమె ఇంటికి షర్మిల వెళ్లారు. కాటారం మండలం విలాసాగర్‌కు చెందిన మంచినీళ్ల కొమురమ్మ కూతురు కొమురమ్మ. ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ దశలో ఉండగా.. వైఎస్ హఠాన్మరణంతో తల్లి కొమురమ్మ గుండెపోటుతో చనిపోయారు. ఇంటి నిర్మాణం ఆగిపోయింది. మరోవైపు ఆమె కూతురు పెళ్లీడుకు వచ్చింది. పెళ్లి కష్టమనుకున్న సమయంలో జగన్ రూ.లక్ష చెక్కు పంపారు. ఈ డబ్బుతోనే ఊరివాళ్లంతా కలిసి ఆమెకు పెళ్లి చేశారు. ఇంటికి రేకులు తెచ్చి పైకప్పు వేశారు. ఇప్పుడు ఆమె 8 నెలల గర్భవతి. తమ ఇంటికి వచ్చి షర్మిల కొంత డబ్బు చేతిలో పెట్టగానే కొమురమ్మ ఉద్వేగానికి గురైంది. ‘‘అమ్మా.. మా నాయిన నాకు ఏమీయ్యలే.. మీ నాయినే నాకు ఇల్లు కట్టిచ్చిండు, పెళ్లి కాదనుకున్న నాకు జగనన్న డబ్బు ఇచ్చి పెళ్లి చేసిండు. ఇప్పుడు మీరు నా ఇంటికొచ్చి కాన్పుకు సాయమైనరు. తల్లిదండ్రులు లేని నాకు మీ ఇల్లే.. నా తల్లిగారిల్లమ్మా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. -
'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఒక్కరికి పక్కాఇల్లు'
కరీంనగర్ : వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర రెండో రోజు ముగిసింది. జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మారం నియోజకవర్గాల్లో ఆరు కుంటుంబాలను షర్మిల పరామర్శించారు. యాత్రలో భాగంగా ధర్మారంలో అడుగుపెట్టిన షర్మిలకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడ ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి భరోసా కల్పించిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి రాజేశేఖర్ రెడ్డి అని చెప్పారు. ఆరోగ్య శ్రీ, 108 ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందించిన నేత వైఎస్సార్ అని షర్మిలా గుర్తుచేశారు. వైఎస్ఆర్ బతికుంటే ప్రతిఒక్కరికి పక్కా ఇల్లు, ఎకరానికి నీరు, పేదవాడికి ఉచిత విద్య అందేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పరామర్శయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లసూర్యప్రకాశ్, బోయినిపల్లి శ్రీనివాస్‌రావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వేణుమాధవరావులతో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శ యాత్రలో పాల్గొన్నారు. -
ఫహీయుద్దీన్ కుటుంబానికి పరామర్శ
వరంగల్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర వరంగల్ జిల్లాలోకొనసాగుతోంది. చివరి విడత పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం పాలంపేటలో ఫహీయుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించారు. మరికాసేపట్లో అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. -
ఎన్నాళ్లయినా.. అదే అభిమానం
-
ఎన్నాళ్లయినా.. అదే అభిమానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: పేద ప్రజల పెన్నిధి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఆరేళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆయన పథకాల ప్రస్తావనే. వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర సందర్భంగా ఏ పల్లెను చూసినా, ఎవరి నోట విన్నా వైఎస్సార్ గొప్పతనం ప్రస్తావనే. ‘మాకు రేషన్ కార్డు వైఎస్సే ఇచ్చిండు.. మా ఇల్లు అప్పుడు కట్టినం.. నాకు పింఛను ఇచ్చిన దేవుడు.. నా గుండెకు ఆపరేషన్ చేయించిండు.. అప్పుడు రైతుల పరిస్థితి బాగుండె.. ఉచిత కరెంటు ఇచ్చిండు, లోన్లు మాఫీ జేసిండు. మా అబ్బాయి ఉట్టిగ ఎంబీఏ చదివిండు...’ ఇలా ప్రజలంతా వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరిస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ యాత్రలో పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లోని 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ఆయా గ్రామాల్లో ఎక్కడ విన్నా వైఎస్ పాలన గురించే చెప్పుకోవడం కనిపించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి విషయంలో అప్పటి, ఇప్పటి పరిస్థితి పోల్చిచూసుకోవడం వినిపించింది. షర్మిల వెళ్లిన ప్రతి చోటా వైఎస్ తనయ వచ్చిందన్న సంతోషం... వైఎస్‌ను, తమవారిని గుర్తు చేసుకున్న ఉద్వేగం కలగలిసి కనిపించింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 77 మంది చనిపోయారు. ప్రస్తుతం ఇక్కడ 73 కుటుంబాలు ఉంటున్నాయి. వారిని ఓదార్చేందుకు పరామర్శయాత్ర చేపట్టిన షర్మిల.. ఆగస్టు 24 నుంచి 28 వరకు మొదటిదశలో 32 కుటుంబాలను, సెప్టెంబరు 7 నుంచి 11 వరకు జరిపిన రెండో దశలో మరో 30 కుటుంబాలను ఓదార్చారు. రెండోదశ యాత్ర భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలో శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. పేరుపేరునా పలకరిస్తూ.. పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలను అందరూ ఆత్మీయతతో ఆదరించారు. రెండు చేతులతో నమస్కరించి పేరుపేరునా షర్మిల పలకరించినప్పుడు వారంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబంలో ఒకరిగా కలసిపోయి షర్మిల మాట్లాడుతున్నప్పుడు... ‘రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చింది. ఇది మేం కలలో కూడా ఊహించలేదు. ఆమె మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే..’’అని వారంతా ఆనందించారు. షర్మిల ప్రతిచోటా ఆయా కుటుంబాల బాధలు, సమస్యలు తెలుసుకుని ఓదార్చారు. వారందరికీ వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఐదో రోజు నాలుగు కుటుంబాలకు.. వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శయాత్ర చివరి రోజు శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. పరకాల మండలం మల్లక్కపేటలో రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని ఓదార్చి... తిరుపతి తండ్రి బుచ్చయ్యను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే మండలం నాగారంలో కాంబత్తుల శ్రీహరి భార్య శ్రీదేవిని పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత లక్ష్మీపురం గ్రామంలో చెల్పూరి ఉప్పలయ్య కుటుంబాన్ని కలుసుకుని ఆయన భార్య లక్ష్మికి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. చివరగా మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. రాజయ్య భార్య కమలమ్మను ఓదార్చారు. మంచి రోజులు మళ్లీ వస్తాయని చెప్పారు. ఇసిపేటలో పరామర్శ ముగిసిన తర్వాత వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం.విలియం, ఎన్.శాంతికుమార్, ఎన్.భిక్షపతి, జార్జ్ హెర్బర్ట్, షర్మిల సంపత్, కె.నగేశ్, ఎం.శంకర్, టి.నాగరావు, డి.శ్వేత, ఎ.సంతోష్‌రెడ్డి, జి.శివకుమార్, వనజ పాల్గొన్నారు. -
సర్కారు నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు: పొంగులేటి
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలో పార్టీ నాయకురాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా విడతల వారీగా చేయడమే ఆత్మహత్యలకు కారణమన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, రైతులు అధైర్యపడొద్దని ఆయన చెప్పారు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉందని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తోందని తెలిపారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఇక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి లేరనే వార్తను తట్టుకోలేక అత్యధికులు వరంగల్ జిల్లాలోనే చనిపోయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పరామర్శ యాత్రలో ఉండేందుకు ఆరు అడుగుల ఇళ్లు కూడా లేనివారిని షర్మిల చూశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే పక్కాగృహాలు వచ్చేవని పేదప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. వైఎస్ఆర్ అన్నదాతలకు కూడా అండగా నిలిచారని, ఆనాడు రైతు ఆత్మహత్యలు చాలా తక్కువగా ఉండేవని ఆయన అన్నారు. -
ముగిసిన షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర
వరంగల్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర శుక్రవారంతో ముగిసిందని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. శుక్రవారం వరంగల్ నగరంలో కొండ రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రెండో విడతలో వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారని తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో వరంగల్ జిల్లాలో మూడో విడత పరామర్శయాత్రను ఆమె చేపట్టనున్నారని ఆయన వివరించారు. అలాగే ఈ నెల 23 నుంచి కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభంకానుందని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ మరణించి ఆరు ఏళ్లు అయినా ప్రజలు ఆయన్ని మరచిపోలేకపోతున్నారన్నారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై ఈ నెల 13,14 తేదీల్లో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. అధైర్యపడవద్దని రైతులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. మీ పక్షాన తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. -
రెండు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
-
రెండు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. పరకాల నియోజక వర్గం నుంచి యాత్ర ప్రారంభించిన షర్మిల మొదటగా మండలంలోని మల్కక్కపేటలోని రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని నాగారంలో కాంబత్తుల శ్రీహరి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి లక్ష్మీపురంలోని చెల్పూరి ఉప్పలయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తారు. చివరగా మొగళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. శుక్రవారం 25 కిలోమీటర్లు పరామర్శయాత్ర కొనసాగుతుంది. కాగా, జిల్లాలో చేపట్టిన రెండో దశ యాత్ర నేటితో ముగియనుంది. -
షర్మిల రాకతో పులకిస్తున్న కుటుంబాలు
-
మంచి రోజులు మళ్లీ వస్తాయి
ఓరుగల్లు పరామర్శ యాత్రలో షర్మిల భరోసా * నాలుగో రోజు ఏడు కుటుంబాలకు ఓదార్పు * షర్మిల రాకతో పులకిస్తున్న కుటుంబాలు * నేడు ముగియనున్న రెండో దశ యాత్ర సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘అంతా మంచే జరుగుతుంది. ఇక నుంచి మీరు మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి’’ - అంటూ పరామర్శ యాత్రలో తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్న వారికి షర్మిల భరోసా ఇచ్చారు. వరంగల్ జిల్లాలో ఆమె రెండో దశ పరామర్శ యాత్ర గురువారం నాలుగో రోజు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన ఏడుగురి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ స్కూల్ ఆవరణ నుంచి మొదలై దుగ్గొండి, శాయంపేట, రేగొండ, పరకాల మండలాల్లో 98 కిలోమీటర్ల దూరం యాత్ర జరిగింది. వైఎస్ తనయ, జగన్మోహన్రెడ్డి సోదరి తమ గ్రామాలకు వస్తోందని తెలియగానే ఆమెను చూసేందుకు ప్రజలు బారులుతీరారు. దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆదరించారు. తమ ఇంటి మనిషే తిరిగొచ్చినట్టుగా ఆనందపడ్డారు. వైఎస్ మృతితో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్టే అయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మీ నాయన మాకు చేసిన మేలు మాటల్లో చెప్పలేమమ్మా. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో మాకందరికీ ఆత్మీయుడయ్యాడాయన. ఆయన పోయాక అంతా మారిపోయింది’’ అని పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబసభ్యులు అన్నారు. ‘వైఎస్ ఉంటే మాకు భరోసా ఉండేది. ఇంత దూరం మాకోసం వచ్చిన నిన్ను మరవమమ్మా’ అని ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరమ్మ కుటుంబసభ్యులు అన్నారు. డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్షలు చేస్తున్న ఆశ వర్కర్లు ఆత్మకూరు, రేగొండ మండల కేంద్రాల్లో షర్మిల దగ్గరికి వచ్చి కలిశారు. తమ డిమాండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించేలా చూడాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర శుక్రవారంతో ముగియనుంది. అన్నం పెట్టిన మహానేత నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ ఇంటికి షర్మిల వెళ్లారు. కొమురమ్మ మనుమరాలు అంకిళ్ల జ్యోతిని పరామర్శించారు. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలోని వేల్పుల వీరాస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిని నర్సయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ‘అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త’ అని నర్సయ్య భార్య పోచమ్మతో అన్నారు. షర్మిల తమ ఇంటికి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ, సుల్తాన్‌పూర్‌లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాలను ఓదార్చారు. ‘ధైర్యంగా ఉండండి. మీకు అండగా ఉంటా’నంటూ వెంకట్రాజం భార్య రాధక్కకు భరోసా ఇచ్చారు. అనంతరం కనిపర్తిలోని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? నాతో వస్తావా’ అని ఓదెలు భార్య సారమ్మను అడిగారు. రాజన్న బిడ్డ తన ఇంటికొచ్చిందంటే నమ్మలేకపోతున్నానంటూ సారమ్మ ఆనందపడ్డారు. తర్వాత పరకాల మండలం కామారెడ్డిపల్లెలో రాజమౌళి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నపరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, భీమయ్యగౌడ్, ఎస్.భాస్కర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, ఎ.కుమార్, ఎం.శంకర్, టి.నాగారావు, ఎ.సంతోష్‌రెడ్డి, ఎస్.భిక్షపతి పాల్గొన్నారు. -
నాలుగోరోజు షర్మిల పరామర్శ యాత్ర
-
కొమురమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర నాల్గో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. మొదటగా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి పరకాల నియోజకర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిన నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని సుల్తాన్‌పూర్‌లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి కనిపర్తికి చేరుకుని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాలుగో రోజు చివరగా పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర దూరం 107 కిలో మీటర్లు సాగనుంది. -
ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ
-
మూడోరోజు షర్మిల పరామర్శ యాత్ర
-
ఆరు కుటుంబాలకు షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ మూడోరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు. -
ఐలయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా లో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా బుధవారం ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మొదటగా నెక్కొంట మండలం మండలం వెంకటాపురంలోని కూరం ఐలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం దీక్షకుంట చేరుకుని అక్కడ బేతం చంద్రయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం కొమ్ముల మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి చెన్నారావు పేట మండలం జీజీఆర్ పల్లికి చేరుకుని బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. మూడో రోజు యాత్రలో చివరగా ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం ఓటాయితండలోని బానోత్ మంగళి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. -
ముగిసిన రెండో రోజు షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని నెల్లికుదురు, మహబూబాబాద్, గూడురు మండలాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ రోజు 93 కిలో మీటర్ల మేర పర్యటించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని, చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని, మహబూబాబాద్‌లో కర్రెయ్య కుటుంబాన్ని, గాంధీపురంలో షేక్ బికారి కుటుంబాన్ని, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని, చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు. -
కర్రెయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్‌లో కర్రెయ్య కుటుంబాన్ని, తార్సింగ్బాయి తాండాలో గుగులోత్ బచ్చి కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బబ్బి మనవడు, మనవరాలికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఉపాధి చూపుతానని షర్మిల హామీ ఇచ్చారు. -
సాయమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
సాయమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తార్సింగ్ బాయితండాలోని గుగులోత్ బబ్బి కుటుంబాన్ని కలుసుకుంటారు. అక్కడ నుంచి చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మహబూబాబాద్ చేరుకుని పట్టణంలోని కరయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం అదే మండలంలోని గాంధీపురం గ్రామానికి చెందిన షేక్ బికారి కుటుంబానికి భరోసా ఇచ్చి, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మంగళవారం పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల 119.5 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. -
ప్రజల బాధను గుండెలో పెట్టుకున్నారు
* అందుకే వైఎస్సార్ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు * వరంగల్ జిల్లా రెండోదశ పరామర్శయాత్రలో షర్మిల సాక్షి ప్రతినిధి, వరంగల్: ఒక నాయకుడి మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోవడం దేశచరిత్రలోనే లేదని.. అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలోనే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వందల మంది గుండె పగిలి ఆయన వెంట వెళ్లిపోయారన్నారు. ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వైఎస్ పాలన సాగించారని.. ఆయన ఆశయాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్ర ప్రారంభించిన షర్మిల... పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. రాయపర్తి మండల కేంద్రంలో తనకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్సార్ ఇప్పటికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఒక నాయకుడు చనిపోతే ఆ మరణాన్ని తట్టుకోలేక వందల మంది గుండె ఆగి చనిపోవడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అంతగొప్పగా వైఎస్సాఆర్ పాలన సాగించారు. ప్రజల బాధను వైఎస్సాఆర్ తన గుండెలో పెట్టుకుని ఆలోచించేవారు. ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టారు. రైతుల కష్టాలను తొలగించేందుకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. రుణాలు మాఫీ చేశారు. నష్టపరిహారం పెంచారు. మహిళలను లక్షాధికారులను చేశారు. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్నారు. వైఎస్ పాలనా సమయంలో దేశం మొత్తం మీద ప్రభుత్వాలు 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే... వైఎస్సార్ ప్రభుత్వం ఇక్కడ ఒక్క రాష్ట్రంలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో పేదలు పెద్ద చదువులు చదివారు. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యం అందించారు. అందుకే ప్రజలు వైఎస్సాఆర్‌ను తమ గుండెల్లో పెట్టుకున్నారు. తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో రాజన్నగా జీవించే ఉంటారు. అలాంటి వైఎస్సార్ ఆశయాలను, పథకాలను మనమే బతికించుకోవాలి. అందుకోసం అందరం చేయిచేయి కలపాలి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. వైఎస్సార్‌పై అభిమానంతో వచ్చిన ప్రతిఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా...’’ అని షర్మిల పేర్కొన్నారు. తొలి రోజు.. ఆరు కుటుంబాలకు.. వరంగల్ జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శయాత్ర సోమవారం మొదలైంది. ఆమె హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి జనగామ మీదుగా కొడకండ్ల మండలం గండ్లకుంటకు చేరుకుని తొలుత ఏడెల్లి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇదే మండలం రేగులలో కొత్తగట్టు శాంతమ్మ కుటుంబానికి భరోసా కల్పించారు. తర్వాత రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబసభ్యులను ఓదార్చిన ఆమె... రాయపర్తి మండల కేంద్రంలో ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని, నాంచారి మడూరులోని గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఈ కుటుంబాల వారికి అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించారు. సోమవారం పరామర్శ యాత్రలో ఆమె 217 కిలో మీటర్లు ప్రయాణించారు. యాత్రలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, జార్జ్ హెర్బర్ట్, సయ్యద్ ముజతబ్ అహ్మద్, ఎం.సందీప్, బి.శ్రీనివాసరావు, ఎస్.భాస్కర్‌రెడ్డి, జి.సురేశ్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ఎ.గోపాలరావు, ఎం.భగవంత్‌రెడ్డి, బి.శ్రీనివాస్, ఎ.కుమార్, షర్మిల సంపత్, బి.బ్రహ్మానందరెడ్డి, సెగ్గం రాజేశ్, జి.జైపాల్‌రెడ్డి, జి.శివకుమార్, జె.అమరనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ పథకాలకు గండికొడుతున్నారు: పొంగులేటి సాక్షి, హన్మకొండ: అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా రాయపర్తిలో పొంగులేటి ప్రసంగించారు. ‘‘ప్రజల మనసు తెలుసుకుని వారికి అవసరమైన పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు. రాజకీయాలకు అతీతంగా వాటిని అమలు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ పథకాలను మార్చాలని చూస్తోంది. వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలను వైఎస్సార్సీపీ సహించదు. ప్రభుత్వం ఇలా చేయవద్దని డిమాండ్ చేస్తున్నా...’’ అని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి అందరం కలసి కష్టపడదామని పిలుపునిచ్చారు. -
తొలిరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర
వరంగల్: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పరామర్శించారు. సోమవారం ఉదయం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయల్దేరారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సోమవారం రోజు పరామర్శయాత్రలో భాగంగా 63కిలోమీటర్లు పర్యటించారు. ఈ పరామర్శయాత్రలో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. -
వెంకటయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ
-
నేటి నుంచి షర్మిల రెండోదశ పరామర్శ యాత్ర
-
నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
వరంగల్ జిల్లాలో రెండోదశ * పాలకుర్తి నియోజకవర్గంలో ప్రారంభం * 11వ తేదీ వరకు కొనసాగనున్న యాత్ర * 31 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల * ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, వరంగల్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను తమ కుటుంబంగా భావించి వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండో దశ పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర సాగనుంది. ఐదు రోజుల యాత్రలో భాగంగా 31 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో వైఎస్ తనయ పర్యటిస్తారు. అన్నదాతలు, మహిళలు, పేదలు... అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న అకాల మరణం పొందారు. ఈ ఘోరాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో చాలా మంది చనిపోయారు. ఇలా చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానంటూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను ఆచరణలో చూపేందుకు వైఎస్సార్ కుటుంబ ప్రతినిధిగా షర్మిల వరంగల్ జిల్లాలో ఆగస్టు 24 నుంచి 28 వరకు మొదటి దశ పరామర్శ యాత్ర చేపట్టారు. ఐదు రోజులపాటు జిల్లాలోని 32 కుటుంబాలను ఓదార్చారు. వరంగల్ జిల్లాలో ఇంకా 43 కుటుంబాలను పరామర్శించాల్సి ఉంది. పరామర్శ యాత్ర రెండోదశలో భాగంగా షర్మిల తొలి రోజు సోమవారం పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గండ్లకుంటలోని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ యాత్ర కోసం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా ఇన్చార్జి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు ఇలా... హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయలుదేరుతారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. పరామర్శ టూర్ షెడ్యూల్ ఇది... * సెప్టెంబర్ 7న పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు... * 8న మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలకు... * 9న నర్సంపేట నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలకు, ములుగు నియోజకవర్గంలోని ఒక కుటుంబానికి.. * 10న నర్సంపేట, నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు, పరకాల నియోజకవర్గంలో ఒక కుటుంబానికి, భూపాలపల్లి నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు... * 11న పరకాల నియోజకవర్గంలో నాలుగు కుటుంబాలకు, భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు కుటుంబాలకు పరామర్శ. -
రేపట్నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
వరంగల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈనెల 9,10 తేదీల్లో నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నారు. పరామర్శయాత్రలో భాగంగా నర్సంపేటలో వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించనున్నట్లు పార్టీ నేత గోవర్థన్ రెడ్డి తెలిపారు. -
ఇచ్చిన మాట కోసమే..
షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు.. * 31 కుటుంబాలకు పరామర్శ * వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తొర్రూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని నల్లకాల్వలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట కోసమే ఆయన సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా ఇన్చార్జి కొండా రాఘవరెడ్డి అన్నారు. శనివారం తొర్రూరు మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాల పరామర్శ కోసం వరంగల్ జిల్లాలో రెండో విడత యాత్ర ఈ నెల 7న పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని గంట్లకుంట గ్రామంలో ప్రారంభమై, 11న భూపాలపల్లి మండలంలోని ఇసిపేటలో ముగుస్తుందన్నారు. పరామర్శ యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు. రాజకీయాలకు అతీతంగా పాల్గొనండి.. షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మునిగాల విలియమ్స్, గుడూరు జయపాల్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, జిడిమేట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
7 నుంచి వరంగల్‌లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈ యాత్ర షెడ్యూలును కొండా రాఘవరెడ్డి, బీష్మా రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులు శనివారం వరంగల్ జిల్లాలోని తొర్రూరులో విడుదల చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 31 మంది కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. -
జనం గుండెల్లో వైఎస్..
వరంగల్ జిల్లాలో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎవరిని కదిపినా ఆ మహానేత జ్ఞాపకాలే.. ఎవరిని పలకరించినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మాటే.. మాకు పింఛన్ వచ్చిందని ఒకరంటే.. మాకు ఉచిత కరెంటిచ్చాడని మరొకరు.. మా అప్పులు మాఫీ జేశారని ఒకరంటే.. నాకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించాడని ఇంకొకరు! వైఎస్సార్ తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్రలో భాగంగా ఆమె వెళ్లిన ప్రతీచోట జనం వైఎస్ పాలననే గుర్తుకుతెచ్చుకున్నారు. శుక్రవారం ఐదోరోజు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారం వద్ద ఈ యాత్ర తొలిదశ ముగిసింది. మొత్తంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లోని 32 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెళ్లిన ప్రతీచోట ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ వైఎస్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంట్లో మనిషిలా.. పరామర్శ కోసం వెళ్లిన చోట షర్మిలపై ఆయా కుటుంబాలు ఎంతో ఆప్యాయత చూపాయి. రెండు చేతులతో నమస్కరిస్తూ.. అందరినీ పేరుపేరునా పలకరించిన ఆమెను ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. ‘‘రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చింది. ఆ బిడ్డ మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే. రాజన్న కూతురు మా గడపలో అడుగుపెట్టింది. ఇది మేం కలలో కూడా ఊహించలేదు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను చూశాంగానీ.. మా కష్టసుఖాలు తెలుసుకుని.. మాతో మాట్లాడటం కోసమే వచ్చిన మొదటి నాయకురాలు షర్మిల’’ అని పలువురు పేర్కొన్నారు. ఐదోరోజు 4 కుటుంబాలకు పరామర్శలు.. పరామర్శ యాత్రలో శుక్రవారం షర్మిల నాలుగు కుటుంబాలను పరామర్శించారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ ఇంటికి వెళ్లి బొల్లు సమ్మయ్యతో మాట్లాడారు. ‘ఏం పనులు చేస్తున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది’ అని తెలుసుకున్నారు. అనంతరం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ‘‘రాజన్న ఉన్నప్పుడు వర్షాలు పడ్డారుు. ఈరోజు మీరొచ్చారు. మళ్లీ వర్షం కురిసింది. వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు వరలక్ష్మిలా వచ్చావు. రేపు రాఖీ.. మా ఇంటికి పండగలా వచ్చావు’’ అని చంద్రకళ కుటుంబ సభ్యులు షర్మిలతో ఆనందం పంచుకున్నారు. అనంతరం పర్వతగిరి మండలం కేంద్రంలోని పల్లూరి కొమురమ్మ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు(ఎమ్మెల్యే), గట్టు శ్రీకాం త్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, ఆకుల మూర్తి, కె.కుసుమకుమార్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, ఎం.శంకర్, షర్మిల సం పత్, సాదు రమేశ్‌రెడ్డి, జార్జ్ హెర్బర్ట్, జి.శివకుమార్, ఎ.సంతోష్‌రెడ్డి, వనజ పాల్గొన్నారు. వైఎస్ తరహా పాలన కోరుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారని వైఎస్సార్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాల స్ఫూర్తిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నీరుగార్చాయని అన్నారు. వరంగల్ జిల్లాలో షర్మిల తొలిదశ పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా తొర్రూరు మండలం సోమారంలో పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలతోనే వైఎస్ ప్రజానేత అయ్యారన్నారు. షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. రాజన్న రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్ర నిర్వహించ నున్నట్లు తెలిపారు. -
ముగిసిన వైఎస్ షర్మిల పాదయాత్ర
-
రాజన్న బిడ్డ రాక..కొండత ధైర్యాన్ని ఇచ్చింది
-
వరంగల్ జిల్లాలో ముగిసిన తొలి విడత పరామర్శయాత్ర
వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈరోజు పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇచ్చారు. మొదటి విడత యాత్రలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. -
కొమరమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
బొల్లు ఎల్లమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ముందుగా పరకాల నియోజక వర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వర్థన్న పేట నియోజక వర్గం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ కుటుండ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యులను కలుస్తారు. శుక్రవారం పరామర్శ యాత్ర 67 కిలోమీటర్లు సాగనుంది. వరంగల్ జిల్లాలో మొదటి విడతగా వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నేటితో ముగియనుంది. -
నాలుగో రోజు ముగిసిన పరామర్శయాత్ర
-
నాలుగో రోజు ముగిసిన పరామర్శయాత్ర
వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. గురువారం నాలుగురోజు హన్మకొండ, వరంగల్, గీసుకొండ మండల్లాలోని 7 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఆమె 68 కిలోమీటర్లు ప్రయాణించారు. ఊకల హవేలీలో ఓదెల స్వామి కుమారులిద్దరికీ షర్మిల రాఖీ కట్టారు. పరామర్శయాత్రలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, బీశ్వ రవీందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం 4 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. -
రాజ్యలక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
సుదర్శన్ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
చిరంజీవి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
తీగల చిరంజీవి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పెద్దమ్మగడ్డ లోని తీగల చిరంజీవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అక్కడి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మమైదాన్‌లో జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్తారు. తర్వాత దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య, కాశిబుగ్గలోని నాగవెల్లి వీరస్వామి, ఉర్సులోని రామ సుదర్శన్ కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని మరిపురంలోని బిట్ల రాజ్యలక్ష్మీ ఇంటికి వెళ్తారు. నాలుగో రోజు చివరగా ఇదే మండలం ఊకల్ హవేలిలోని ఓదెల స్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర 68 కిలో మీటర్లు సాగనుంది. -
మాటిస్తున్నా.. అండగా ఉంటాం!
వరంగల్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల * ఏ ఆపదొచ్చినా ఒక్క పిలుపు చాలు.. మీ కష్టాలు మా కష్టాలతో సమానం * మీరంతా మా కుటుంబంలోని సభ్యులే.. మూడో రోజు 7 కుటుంబాలకు పరామర్శ * హన్మకొండలో అమరవీరుల కీర్తి స్థూపానికి, వైఎస్ చిత్రపటానికి నివాళులు సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘ఏ కష్టమొచ్చినా మేమున్నాం. వైఎస్సార్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఏ ఆపదలోనైనా మీకు ఆసరాగా ఉంటాం. మీ కష్టాలు మా కష్టాలతో సమానం. అవసరం వచ్చినప్పుడు మాకు చెప్పండి. మీరూ మా కుటుంబంలో సభ్యులే...’’ అంటూ వైఎస్సార్ తనయ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల భరోసానిచ్చారు. వరంగల్ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం మూడోరోజు స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని మాటిచ్చారు. కుటుంబాల్లోని సభ్యులందరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. మడికొండ గ్రామంలో మద్దెల గట్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న షర్మిల. చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్ నుంచి బయలుదేరారు. పీచర, మల్లికుదురు, మడికొండ, సింగారం, మామునూరులో కుటుంబాలను పరామర్శించారు. 82.5 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో దారిపొడవునా ప్రజలు షర్మిలకు అభివాదం చేస్తూ స్వాగతం పలికారు. సింగారంలోని మహిళలు బోనాలతో షర్మిలను తమ ఊరికి ఆహ్వానించారు. హన్మకొండలోని వరంగల్ జిల్లా కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల కీర్తి స్తూపానికి, అక్కడే ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి షర్మిల, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. గురువారం వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. అన్నా.. అమ్మను బాగా చూసుకో! వైఎస్ మృతిని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన ఎడపెల్లి వెంకటయ్య కుటుంబా న్ని పరామర్శించేందుకు షర్మిల ధర్మసాగర్ మండలం పీచరకు వెళ్లారు. వెంకటయ్య భార్య రాజమ్మ, కుమారుడు రవీందర్, ఇతర కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వారింట్లో గంటసేపు గడిపారు. ‘‘బోర్లలో నీళ్లు ఉన్నాయా? వ్యవసాయం ఎలా ఉంది’’ అని వారిని అడిగారు. వ్యవసాయం లాభసాటిగా లేదని, కుటుంబం గడవటం చాలా ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. రాజమ్మ విలపించడంతో షర్మిల ఆమెను దగ్గరకు తీసుకుని.. ‘‘అమ్మా.. ఇక్కడ కష్టంగా ఉంటే నాతో వస్తావా? తీసుకెళ్తా.. గుం డె ధైర్యంతో ఉండాలమ్మా..’’ అంటూ ఓదార్చా రు. ‘‘అన్నా.. అమ్మను బాగా చూసుకొండ న్నా.. మీకు రాజన్న కుటుంబం అండగా నిలుస్తుంది’’ అని రవీందర్‌కు చెప్పారు. ఏ కష్టం వచ్చినా తనకు ఫోన్ చే యాలని సూచించారు. కుటుంబం ఎలా గడుస్తోంది.. ధర్మసాగర్ మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘‘కుటుంబం ఎలా గడుస్తోంది? గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా? వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి’’ అని షర్మిల వారిని అడిగారు. తమది నిరుపేద కుటుంబమని వైఎస్ దయతోనే ప్రస్తుత ఇంటిని నిర్మించుకున్నామని మర్రి ఐలయ్య తెలిపారు. తర్వాత మడికొండలోని మద్దెల గట్టయ్య కుటుంబాన్ని కలిశారు. గట్టయ్య భార్య వరలక్ష్మి, కూతురు కోమల, కుమారులు కుమారస్వామి, అశోక్‌కుమార్ వారి కుటుంబీకులను పేరుపేరునా పలకరించారు. ఇదే ఊరిలో దోమ లింగయ్య ఇంటికి షర్మిల వెళ్లారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మడికొండకే చెందిన వస్కుల సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పలకరించారు. ‘ధైర్యంగా ఉండండి.. మీకు ఏ కష్టమొచ్చినా నా వద్దకు రండి. అండగా ఉంటాను..’ అని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, జె.అనిల్‌కుమార్, షర్మిల సంపత్, జి.శివకుమార్, జె.నాగరావు, కె.నాగభూషణం, అంకసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చదివిస్తా.. వైద్యం చేయిస్తా.. హన్మకొండ మండలం మామునూరులోని ఎర్ర భాస్కర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది. ఏం పని చేస్తున్నారు’ అని భాస్కర్ భార్య లతను ఆప్యాయంగా పలకరించారు. ‘‘పెద్ద కొడుకుకు పోలియో వచ్చింది. చిన్న కొడుకు ఎల్కేజీ చదువుతున్నాడు. కూలీ పనిచేసుకుంటూ వాళ్లను సాకుతున్న. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన పదో రోజు ఆ బాధతో ఆయన ఉరివేసుకున్నడు..’’ అని లత కన్నీరు పెట్టుకుంది. దీంతో చలించిన షర్మిల.. ‘‘నీ చిన్న కొడుకు మంచిగా చదువుకుంటే డాక్టర్ అయ్యే వరకు ఖర్చులన్నీ భరిస్తా. నీ పెద్ద కొడుకుకు వైద్యం చేయిస్తా. నీకు పని కల్పిస్తా..’’ అని ఆమెకు హామీ ఇచ్చారు. భాస్కర్ సోదరుడికి ఆటో కోసం సాయం చేస్తానని, భాస్కర్ రెండో సోదరుడు వినయ్ చదువులో రాణిస్తే ఉద్యోగం వచ్చేలా మాట సాయం చేస్తానని చెప్పారు. లత పెద్ద కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డికి సూచించారు. బుధవారం వరంగల్ జిల్లా మడికొండలో దోమ లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న షర్మిల