వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం సింగారంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. మహానేత మరణం తట్టుకోలేక మరణించిన కాకర్ల రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని రాజయ్య కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు.
ఆ తర్వాత మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు.