రేపటి నుంచి గ్రేటర్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని తెలంగాణ వైఎస్ఆర్‌సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, ఆదం విజయ్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 18 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని అన్నారు. మంగళవారం నాడు 8 కుటుంబాలు, బుధవారం 6వ తేదీన 8 కుటుంబాలు, శుక్రవారం 7వ తేదీన 2 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
మంగళవారం నాడు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతుంది. 6వ తేదీన సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీ నగర్ నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. 7వ తేదీన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర ఉంటుంది. మెదక్ జిల్లాలో సోమవారంతో పరామర్శ యాత్ర పూర్తవుతుందని తెలంగాణ వైఎస్ఆర్‌సీపీ నేతలు శివకుమార్, సురేష్ రెడ్డి, ఆదం విజయ్ తెలిపారు.