నగరం నుంచి వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు | Since the city is a huge political crossroads | Sakshi
Sakshi News home page

నగరం నుంచి వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు

Published Sun, Aug 14 2016 9:11 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న వైఎస్సార్‌సీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి - Sakshi

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న వైఎస్సార్‌సీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి

నాంపల్లి: వైఎస్సార్‌సీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి సమక్షంలో ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి  కార్యకర్తలు పెద్దఎత్తున పార్టీలో చేరారు. పలు బస్తీలకు చెందిన  కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సాయినాథ్‌రెడ్డి పార్టీలో చేరిన కార్యకర్తలకు కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముషీరాబాద్‌కు చెందిన కందూరి రామచంద్రయ్య, ఎ.శ్రీహరి, హెచ్‌.పి.వెంకటేష్, ఎం.సైదులు, జి.ఎస్‌. డేవిడ్‌ శ్యామ్‌రాజ్, వి.లక్ష్మారెడ్డి, ఎస్‌.రాములు, బి.మల్లేష్, ఇ.శేఖర్, బి.రాజు, పవన్‌ కుమార్‌లు ఆయా బస్తీల్లోని కార్యకర్తలతో కలిసి వైఎస్సార్‌సీపీలో  చేరారు.

అనంతరం సాయినాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలోనే డివిజన్‌ స్థాయి సమావేశాలు నిర్వహించి అన్ని డివిజన్లకు అధ్యక్షులను ఎన్నుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి మాజిద్‌ ఖాన్, సూరిబాబు, నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అభిలాష్‌ గౌడ్‌ పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement