వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ మూడోరోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెంట పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులున్నారు.