వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. పరకాల నియోజక వర్గం నుంచి యాత్ర ప్రారంభించిన షర్మిల మొదటగా మండలంలోని మల్కక్కపేటలోని రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని నాగారంలో కాంబత్తుల శ్రీహరి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి లక్ష్మీపురంలోని చెల్పూరి ఉప్పలయ్య ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తారు. చివరగా మొగళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. శుక్రవారం 25 కిలోమీటర్లు పరామర్శయాత్ర కొనసాగుతుంది. కాగా, జిల్లాలో చేపట్టిన రెండో దశ యాత్ర నేటితో ముగియనుంది.