వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది.
నల్లగొండ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన మలివిడత పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది. ఈరోజు ఉదయం ఆమె అంకిరెడ్డిగూడెంలో బి.వసంతరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.
తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని.. కష్టాల్లో అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఈ నెల 9న నల్లగొండ జిల్లాలో మలివిడత యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆత్మీయ అనురాగాలు, ఆప్యాయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది.