'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఒక్కరికి పక్కాఇల్లు'
కరీంనగర్ : వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర రెండో రోజు ముగిసింది. జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మారం నియోజకవర్గాల్లో ఆరు కుంటుంబాలను షర్మిల పరామర్శించారు. యాత్రలో భాగంగా ధర్మారంలో అడుగుపెట్టిన షర్మిలకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడ ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి భరోసా కల్పించిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి రాజేశేఖర్ రెడ్డి అని చెప్పారు. ఆరోగ్య శ్రీ, 108 ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందించిన నేత వైఎస్సార్ అని షర్మిలా గుర్తుచేశారు. వైఎస్ఆర్ బతికుంటే ప్రతిఒక్కరికి పక్కా ఇల్లు, ఎకరానికి నీరు, పేదవాడికి ఉచిత విద్య అందేదని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ పరామర్శయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లసూర్యప్రకాశ్, బోయినిపల్లి శ్రీనివాస్‌రావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వేణుమాధవరావులతో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శ యాత్రలో పాల్గొన్నారు.