రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం | ys sharmila paramarsha yatra second day in karimnagar | Sakshi
Sakshi News home page

రెండో రోజు పరామర్శ యాత్ర ప్రారంభం

Published Fri, Oct 2 2015 10:13 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

ys sharmila paramarsha yatra second day in karimnagar

కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఈ రోజు హుజురాబాద్, మానకొండూరు నియోజక వర్గాల్లో పర్యటించి ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. హుజురాబాద్ లో యాత్ర ప్రారంభించిన షర్మిల అక్కడ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

అనంతరం మండలంలోని సిర్సపల్లి, రాంపూర్, జమ్మికుంట మండలం ధర్మారం, గండ్రపల్లిలో ఎడ్ల వెంకటనర్సు, సంచు తిరుపతి, పసుపుల మొగిలి, గాదె ఉప్పలయ్య, కుటుంబాలను కలుస్తారు. ఆ తర్వాత కేశవపట్నం, లక్ష్మీపూర్, బంజేరుపల్లిలో కాసరాజుల లక్ష్మయ్య, ఎడ్ల శ్రీనివాస్, రేణికుంట కొమురయ్య కుటుంబాలను పరామర్శిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement