వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గం నుంచి పరామర్శ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య కుటుంబాన్నిషర్మిల పరామర్శించారు. అనంతరం ఇదే మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ ఇంటికి వెళ్లి వారికి భరోసా ఇచ్చారు.