వరంగల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం చేర్యాల మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. ముందుగా ఆమె చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్‌ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన యాదగిరి తల్లిదండ్రులు బాలనర్సయ్య, లక్ష్మిలను ఓదార్చారు.