వరంగల్ జిల్లాలో ముగిసిన తొలి విడత పరామర్శయాత్ర | ys sharmila first phase paramarsha yatra close in warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో ముగిసిన తొలి విడత పరామర్శయాత్ర

Published Fri, Aug 28 2015 3:10 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

ys sharmila first phase paramarsha yatra close in warangal district

వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈరోజు పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు.

అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇచ్చారు. మొదటి విడత యాత్రలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement