7 నుంచి వరంగల్లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈ యాత్ర షెడ్యూలును కొండా రాఘవరెడ్డి, బీష్మా రవీందర్, మహేందర్ రెడ్డి తదితరులు శనివారం వరంగల్ జిల్లాలోని తొర్రూరులో విడుదల చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 31 మంది కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.