తొలిరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర | sharmila first day paramarsha yatra fisnished in waranga | Sakshi
Sakshi News home page

తొలిరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర

Published Mon, Sep 7 2015 7:01 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

తొలిరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర - Sakshi

తొలిరోజు ముగిసిన షర్మిల పరామర్శయాత్ర

వరంగల్: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పరామర్శించారు. సోమవారం ఉదయం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను పరామర్శించారు.

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయల్దేరారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సోమవారం రోజు పరామర్శయాత్రలో భాగంగా 63కిలోమీటర్లు పర్యటించారు. ఈ పరామర్శయాత్రలో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement