పరిగి/ తాండూరు : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ తనయ షర్మిల ఈ నెలాఖరున జిల్లాలో పర్యటించనున్నారు. పరిగి, తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ తదితర నియోజకవర్గాల్లో మీదుగా పరామర్శ యాత్ర కొనసాగనుందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు ఆయా నియోజకవర్గాల్లో రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు.
ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి తదితర నాయకులు పరిగితోపాటు మండల పరిధిలోని రంగాపూర్ గ్రామాలను సందర్శించారు. రంగాపూర్, పరిగిలో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. రంగాపూర్‌లో కృష్ణారెడ్డి, పరిగిలో శ్రీనివాస్ కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారని పార్టీ నాయకులు తెలిపారు.
రూట్‌మ్యాప్‌ను పరిశీలించిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి యాదయ్య, జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి అజీజ్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి రాజేందర్, పరిగి మండల మైనార్టీ సెల్ కార్యదర్శి జాకబ్, నాయకులు శ్రీనివాస్, సురేష్, రాములు నరేందర్ పాల్గొన్నారు. తాండూరులో పరామర్శ యాత్ర ఏర్పాట్లపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, నాయకులు అఖిల్, అమ్జద్, డప్పు రాజు, శ్రీకాంత్‌గౌడ్ తదితరులతో రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు.
ఈ నెలాఖరున షర్మిల పరామర్శ యాత్ర
Published Thu, Jun 18 2015 12:14 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement