సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తరఫున పరామర్శిస్తున్న ఆయన సోదరి షర్మిల... అక్టోబర్ 1వ తేదీ నుంచి కరీంనగర్ జిల్లాలో రెండో విడత పరామర్శయాత్ర చేస్తారని ఆ పార్టీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలి పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి 3 వరకు కరీం నగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర నిర్వహిస్తారని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ మండలం వర్కోలులో ఈ యాత్ర ప్రారంభమవుతుందని... 3న మధ్యాహ్నం సమయానికి 18 కుటుంబాలను కలుసుకుంటారని చెప్పారు. 3న సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలోకి షర్మిల అడుగుపెడతారని చెప్పారు. ఆ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గం దిలావార్‌పూర్‌లో యాత్ర ప్రారంభించి 5వ తేదీ వరకు కొనసాగిస్తారని, పది కుటుంబాలను కలుసుకుంటారని వెల్లడించారు.
5వ తేదీన సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి 6వ తేదీ వరకు 19 కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. షర్మిల ఇప్పటివరకు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 169 కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పిం చారని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 5,114 కిలోమీటర్లు ప్రయాణించారన్నారు.
అక్టోబర్‌లో కరీంనగర్ రెండో విడత యాత్ర
Published Fri, Sep 25 2015 1:35 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement