
నాలుగో రోజు ముగిసిన పరామర్శయాత్ర
వరంగల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. గురువారం నాలుగురోజు హన్మకొండ, వరంగల్, గీసుకొండ మండల్లాలోని 7 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఆమె 68 కిలోమీటర్లు ప్రయాణించారు. ఊకల హవేలీలో ఓదెల స్వామి కుమారులిద్దరికీ షర్మిల రాఖీ కట్టారు.
పరామర్శయాత్రలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, బీశ్వ రవీందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం 4 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.