
పరిగిలో షర్మిలకు ఘనస్వాగతం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర రంగారెడ్డిలో జిల్లాలో కొనసాగుతోంది.
పరిగి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర రంగారెడ్డిలో జిల్లాలో కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మూడో రోజు బుధవారం పరిగి వచ్చిన వైఎస్ షర్మిలకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పరిగిలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తున్నారు. ఈ రోజు ఉదయం మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల ఓదార్చురు. సుగుణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పరామర్శయాత్రలో తెలంగాణ వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షులు భీష్మరవీందర్ తదితరులు పాల్గొన్నారు.