వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర నాల్గో రోజు కొనసాగుతోంది.
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర నాల్గో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. మొదటగా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి పరకాల నియోజకర్గం ఆత్మకూరు మండలం పెద్దాపురంలో వేల్పుల వీరాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం పత్తిపాకలో బోయిన నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. అనంతరం రేగొండ మండలం కోనారావుపేటలోని తిప్పారపు మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
తర్వాత ఇదే మండలంలోని సుల్తాన్‌పూర్‌లో గజవెల్లి వెంకట్రాజం కుటుంబాన్ని ఓదార్చుతారు. అక్కడి నుంచి కనిపర్తికి చేరుకుని పల్లెబోయిన ఓదెలు కుటుంబాన్ని పరామర్శిస్తారు. నాలుగో రోజు చివరగా పరకాల మండలం కామారెడ్డిపల్లెలోని కొయ్యడ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర దూరం 107 కిలో మీటర్లు సాగనుంది.