హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ముందుగా పరకాల నియోజక వర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం వర్థన్న పేట నియోజక వర్గం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ కుటుండ సభ్యులను పరామర్శిస్తారు. తర్వాత పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యులను కలుస్తారు.
శుక్రవారం పరామర్శ యాత్ర 67 కిలోమీటర్లు సాగనుంది. వరంగల్ జిల్లాలో మొదటి విడతగా వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నేటితో ముగియనుంది.