
తీగల చిరంజీవి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పెద్దమ్మగడ్డ లోని తీగల చిరంజీవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అక్కడి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మమైదాన్‌లో జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్తారు.
తర్వాత దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య, కాశిబుగ్గలోని నాగవెల్లి వీరస్వామి, ఉర్సులోని రామ సుదర్శన్ కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని మరిపురంలోని బిట్ల రాజ్యలక్ష్మీ ఇంటికి వెళ్తారు. నాలుగో రోజు చివరగా ఇదే మండలం ఊకల్ హవేలిలోని ఓదెల స్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర 68 కిలో మీటర్లు సాగనుంది.