రంగారెడ్డిలో షర్మిల మూడోరోజు పరామర్శ యాత్ర | Sharmila 3rd day paramarsha yatra in rangareddy district | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిలో షర్మిల మూడోరోజు పరామర్శ యాత్ర

Jul 1 2015 9:14 AM | Updated on Mar 28 2018 11:08 AM

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది.

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. షర్మిల ఈ రోజు ఎన్కేపల్లి, రంగాపూర్, పరిగి, గొట్టిగఖుర్దు ప్రాంతాల్లో పరామర్శ యాత్ర చేయనున్నారు. ఎన్కేపల్లిలోఈడిగ సుగుణ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

అలాగే రంగాపూర్లో కె. కృష్ణారెడ్డి కుటుంబాన్ని... పరిగిలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని... గొట్టిగఖుర్దులో అవుసల లక్ష్మణయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. మహానేత తనయ షర్మిల పరామర్శ యాత్ర సోమవారం రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఈ పరామర్శ యాత్ర గురువారంతో ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement