
అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన జిల్లెల్లగూడకు చెందిన బి అంజయ్య కుటుంబీకులను వైఎస్ షర్మిల సోమవారం సాయంత్రం పరామర్శించారు.
జిల్లెలగూడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన జిల్లెల్లగూడకు చెందిన బి అంజయ్య కుటుంబీకులను వైఎస్ షర్మిల సోమవారం సాయంత్రం పరామర్శించారు. నాలుగు రోజుల రంగారెడ్డి జిల్లా పరామర్శయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జిల్లెలగూడ చేరుకున్నషర్మిల.. తొలుత అక్కడ మందలమ్మ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంజయ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ రోజు మరో రెండు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మహేశ్వరం మండలం మంఖాల్‌లో ఎండల జోసెఫ్ కుటుంబ సభ్యులను, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తారు.