
1 నుంచి కరీంనగర్ జిల్లాలో మలి విడత పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అక్టోబర్ 1 నుంచి కరీంనగర్ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర చేపట్టనున్నారు. 1, 2, 3 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటిస్తారని.. 18 కుటుంబాలను పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ తెలంగాణ నేత శివకుమార్ తెలిపారు.
అక్టోబర్ 3 సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా నుంచి పరామర్శయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. 3, 4, 5 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో 10 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. అక్టోబర్ 5 సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారని ఆరోజు, తర్వాత రోజు ఇక్కడ పరామర్శయాత్ర సాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో169 కుటుంబాలను షర్మిల పరామర్శించారని, 4 జిల్లాల్లో పరామర్శయాత్ర పూర్తయిందని శివకుమార్ వెల్లడించారు.