
రెండో రోజు ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు పరామర్శ యాత్ర ముగిసింది.
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు పరామర్శ యాత్ర ముగిసింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మంగళవారం మేడ్చల్లో సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి తాము అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. పరామర్శ యాత్రలో భాగంగా రెండో రోజు కండ్లకోయ, కేసారం, మాడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో వైఎస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజుల పరామర్శ యాత్రను షర్మిల సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.