రంగారెడ్డి: తుపాకీతో కాల్చుకుని ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య | AR Constable Loss Life After Gunfire Incident In Rangareddy District, More Details Inside | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి: తుపాకీతో కాల్చుకుని ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published Sat, Sep 28 2024 7:56 AM | Last Updated on Sat, Sep 28 2024 9:29 AM

Ar Constable Loss Life: Gunfire Incident In Rangareddy District

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్‌లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల కాగా, 2018 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement