బంట్వారం : ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు దొంగబాబాకు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనం బంట్వారం మండలం తుర్‌మామిడి గ్రామంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రెయిన్‌బాబా అనే వ్యక్తి గ్రామంలోని ఓ వ్యవసాయపొలంలో చిన్నకుటీరం వేసుకుని జాతకాలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ జాతకం చెప్పించుకోవడానికి బాబా దగ్గరకు వెళ్లింది. తన భర్త 3 సంవత్సరాల నుంచి కనిపించడం లేదని ఎక్కడున్నాడో తెలపాలని బాబాను కోరింది.
అయితే రాత్రికి రండి అని చెప్పి పంపించాడు .ఆ మహిళ ఆదివారం రాత్రి తన తల్లితో కలిసి బాబా దగ్గరకు వచ్చింది. తల్లిని బయట ఉంచి కూతుర్ని లోపలికి రమ్మని చెప్పాడు. లోపలికి వెళ్లిన తర్వాత సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో వారు దొంగస్వామిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.