
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం) సిద్ధమైంది. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తికావడంతో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వాహనాల రద్దీని నియంత్రించడం, వాయు కాలుష్యం తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.