Logistic hub
-
నేడు లాజిస్టిక్ హబ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం) సిద్ధమైంది. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తికావడంతో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వాహనాల రద్దీని నియంత్రించడం, వాయు కాలుష్యం తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. -
లాజిస్టిక్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తయారు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గడచిన ఏడాదిన్నర కాలంలో భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనేక సమస్యలతో పాటు ఎన్నో అవకాశాలను కల్పించిందన్నారు. సుదీర్ఘమైన కోస్తాతీరం, సహజ వనరులు ఏపీకి సొంతమని ఆయన అన్నారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్గో విభాగంలో ఏపీది రెండో స్థానమని తెలియజేశారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా తెలిపారు. -
'లాజిస్టిక్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ పెట్టుబడులకు అన్ని విధాలుగా అనుకూలమని తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీసిటీలోని పెప్సీ పరిశ్రమను సంస్థ సీఈవో ఇంద్రానూయితో కలిసి ఆయన ప్రారంభించారు. 9 పారిశ్రామిక యూనిట్లకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక అనుమతులకు సింగిల్ విండో విధానం అమలులోకి తేనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోరత లేదని అన్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.