లాజిస్టిక్ హబ్గా ఏపీ: చంద్రబాబు | ap to logistic hub says chandra babu | Sakshi
Sakshi News home page

లాజిస్టిక్ హబ్గా ఏపీ: చంద్రబాబు

Published Mon, Sep 21 2015 4:35 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

లాజిస్టిక్ హబ్గా ఏపీ: చంద్రబాబు - Sakshi

లాజిస్టిక్ హబ్గా ఏపీ: చంద్రబాబు

సింగపూర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా తయారు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గడచిన ఏడాదిన్నర కాలంలో భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనేక సమస్యలతో పాటు ఎన్నో అవకాశాలను కల్పించిందన్నారు.

సుదీర్ఘమైన కోస్తాతీరం, సహజ వనరులు ఏపీకి సొంతమని ఆయన అన్నారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్గో విభాగంలో ఏపీది రెండో స్థానమని తెలియజేశారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement