కీసర: అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భార్య భర్తలను కట్టేసి ఇంట్లో ఉన్న బంగారంతో ఉడాయించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందనపల్లి, వికలాంగుల కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి భార్యాభర్తలను బంధించి.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో సాయం కోసం అరవడానికి ప్రయత్నించిన శ్రీనివాస్ రెడ్డిని తీవ్రంగా గాయపరిచారు. దుండగులు పరారయ్యాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
కీసరలో భారీ చోరీ
Published Sat, Sep 5 2015 11:16 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement