చేవెళ్ల గడ్డ కోసం ఎవరితోనైనా కొట్లాటకు సిద్ధం   | Konda Vishweshwar Reddy Said In Lok Sabha Election We fight With Any Party | Sakshi
Sakshi News home page

చేవెళ్ల గడ్డ కోసం ఎవరితోనైనా కొట్లాటకు సిద్ధం  

Published Sun, Mar 10 2019 3:34 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Konda Vishweshwar Reddy Said In Lok Sabha Election We fight With Any Party - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి

 సాక్షి, శంషాబాద్‌: చేవెళ్ల గడ్డ కోసం ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తన తాత, ముత్తాల గడ్డ అయిన ఈ ప్రాంతానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. శంషాబాద్‌ పట్టణంలో క్లాసిక్‌ త్రీ కన్వెన్షన్‌ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘కనీస ఆదాయ వాగ్దాన’ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినవి కావన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా గుర్తించాలన్నారు. నరేంద్రమోదీ ప్రధాని కావడంతో అచ్చేదిన్‌ ఎవరికి వచ్చాయన్నారు.

మోదీ తెస్తానన్న కాలాధన్‌ ఎవరి జేబులోకి పోయిందని ప్రశ్నించారు. ఐదేళ్ల మోదీ పాలనలో రైతుల ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆశాకిరణమైన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంగ్ల సామెతను ఉటంకించారు. మొదటిసారి మోసపోతే ఎదుటి వారికి సిగ్గులేనట్లు.. రెండోసారి కూడా మోసపోతే మనకు తెలిసి లేనట్లని.. మరోసారి నరేంద్రమోదీకి ఓటేసి మోసపోకూడదని చెప్పారు. కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుక ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్‌ పాలనలోనే పేదల సంక్షేమం: ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
కాంగ్రెస్‌ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకా లు అందాయని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పేద ప్రజల కోసం ఉపాధి హామీ అం దించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్‌కే ఉందన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేద ప్రజలను మోదీ ఇబ్బందుల్లో నెట్టారన్నారు. దేశంలో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోని యాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. రాహుల్‌గాంధీకి సభావేదికకు చేరుకోకముందు చేవెళ్ల మా జీ ఎమ్మెల్యే రత్నం, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వి మర్శలు గుప్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రసంగం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చల్లా ధర్మారెడ్డి అనంతరం ధన్యవాదాల తీర్మానాన్ని తెలిపారు. సభావేదికపై కార్యక్రమాల తీరును పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, సభ్యుడు వే ణుగౌడ్‌ ప్రారంభం నుంచి చివరికి వరకు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement