పరిగి: దొరపాలనను అంతం చేద్దామని, కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ ఎన్నికల క్యాంపెనింగ్ కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కేసీఆర్ రూ.30 కోట్లు ఇచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారు. రైతు ఆత్మగౌరవ సభలో విజయశాంతి ప్రాంతీయ పార్టీల గెలుపుతో ఒరిగేది ఏమీ లేదుఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డిఅన్నారు. ఆదివారం పూడూరు మండలం మన్నెగూడ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు ఆత్మగౌరవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలవకుండా సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపును ఆపలేరని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తప్పనిసరిగా గెలిపించాలని ఆమె కోరారు. కేసీఆర్ రూ. 30 కోట్లిచ్చి ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచి వ్యక్తిత్వం, చరిత్ర ఉన్న కొండాను గెలిపిస్తే చేవెళ్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతారని తెలిపారు. కేసీఆర్ దొరల పాలనను కొనసాగిస్తున్నారని, దానిని అంతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
హీరోలా వచ్చి నీళ్లు తెస్తాడంట
అనంతరం ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. చేతి గుర్తుకు ఓటేస్తే చేవెళ్లకు వేసినట్టు.. కారు ఓటేస్తే కరీంనగర్‌కు వేసినట్టని చెప్పారు. చేవెళ్ల గడ్డ మీద కనీసం ఒక్క మగాడు, మహిళ లేనట్లు రంజిత్‌రెడ్డిని కరీంనగర్ నుంచి దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్, కేసీఆర్ చెప్పే అబద్ధపు మాటలు ప్రజలు ఇంకా ఎక్కువ రోజులు నమ్మే పరిస్థితి లేదని, వారికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.
ఓ పక్క సాగు నీటి ప్రాజెక్టులు జిల్లాకు దూరం చేస్తూ టీఆర్‌ఎస్ సర్కారు మోసం చేస్తుంటే మరో వైపు సినిమా హీరోలా వచ్చి రంజిత్‌రెడ్డి సాగునీరు తెస్తాడంట అని ఆయన ఎద్దేవా చేశాడు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజుక్టు డిజైన్‌ను మార్చి ద్రోహం చేసింది సీఎం కాదా.. అని ప్రశ్నించాడు. సీఎం, పీఎం ఇద్దరూ ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలు గెలిచి సాధించేది ఏమీలేదన్నారు. సీఎం కేసీఆర్ అతిథిలా ఎన్నికలప్పుడే కనిపిస్తారని తెలిపారు.
స్వప్రయోజనాల కోసమే పార్టీ మార్పు
సభలో డీసీసీ అధ్యక్షుడు పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. సొంత ప్రయోజనాల కోసమే నేతలు పార్టీని వీడుతున్నారని విమర్శించారు. పార్టీని వీడినవారంతా తాలులాంటి వారని మిగిలిన వారంతా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులని అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించి ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. స్థారికేతరుడైన రంజిత్‌రెడ్డి ఓడించి టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికలు
ధర్మానికి, అధర్మానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లు న్యాయం, ధర్మం వైపు నిలబడాలని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని కోరారు. మొదట్లో పాలమూరు ఎత్తిపోతల పథకంలో 10 టీఎంసీలు నియోజకవర్గ రిజర్వాయర్లకు కేటాయిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2.8 టీఎంసీలకు కుదించిందని మండిపడ్డారు. అనంతరం మాజీ మంత్రి గడ్డంప్రసాద్‌క్ముార్ మాట్లాడుతూ.. కేసీఆర్ కేవలం ఈవీఎంల ట్యాంపిరింగ్‌తో గెలిచి ప్రభు త్వం ఏర్పాటు చేశారు తప్పా వారికి ప్రజలు ఆశీస్సులు లేవని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ మాట్లాడుతూ.. కొందరు దుర్మార్గులు చేతిగుర్తుపై గెలిచి కారెక్కేందుకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి సబితారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం టీజేఎస్ కోదండరాం, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర య్య మాట్లాడారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు శాంతిబాయి, నారాయణ్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణ, సునీతాసంపత్, లాల్‌కృష్ణ ప్రసాద్, వెంకటేష్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, రాములు, షాహెద్, ఆంజనేయులు, రాంరెడ్డి, భీరెడ్డి, కనకం మొగులయ్య, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment