సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుందన్నారు లోక్‌సభలో బీజేపీ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారని సెటైర్లు వేశారు.
కాగా, కొండా విశ్వేశ్వర రెడ్డి శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు గత ఆరు నెలల్లో 35వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఎంపీల సంఖ్యకు నిధులకు సంబంధం లేదు. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. మా ఐడియాలు కాపీ కొట్టారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బడ్జెట్ బాగా లేదని వాళ్ళే అంటున్నారు.. అంటే మీ ఐడియాలు బాగాలేవా?.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 12 లక్షల ముస్లీంలు ఉంటారు. వక్ఫ్ బోర్డుకు రూ.10 లక్షల ఎకరాల భూమి ఉంది. వక్ఫ్ బోర్డు భూముల ద్వారా ఇప్పుడు కేవలం 190 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వక్ఫ్ బోర్డు ఇష్యూపై జేపీసీ వేశారు. కమిటీలో డీకే అరుణ, ఎంపీ అసద్ ఉన్నారు. వచ్చే సెషన్‌లో వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం పొందవచ్చు. వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలకు లాభం జరుగుతోంది.
జుంటుపల్లి ప్రాజెక్టు గేట్లు ఐదేళ్లుగా పనిచేయడం లేదు. తక్కువ ఖర్చుతో జంటుపల్లి ప్రాజెక్టు గేట్లను ప్రభుత్వం మరమ్మతు చేయించింది. లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్టు కట్టడం కంటే ముందు ఎస్‌టీపీల నిర్మాణం, నిర్వాహణ చేయాలి. మూసీ ప్రాజెక్టు మంచిదే.. కానీ ప్రయార్టీ కాదు. త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తాను. జంట జలాశయాలపైన ఇప్పుడు 111 జీవో ఉందా?. 69 జీవో అమలు చేస్తున్నారో తెలియడం లేదు. సీఎం రేవంత్‌ను కలిసి 111 జీవోపై నివేదిక ఇస్తాను అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment