సాక్షి, రంగారెడ్డిజిల్లా: పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజ కవర్గంలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ బీఆర్‌ఎస్ అధిష్టానం ఊహాగానాలకు చెక్‌పెట్టగా, ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆశావహులు పోటీపడుతున్నారు. చేవెళ్ల కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నా యి.
ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా ఈ అసెంబ్లీ టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగపడిన పారిజాత నర్సింహారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి అతి సన్నిహితుడైన ఎలుగింటి మధుసూదన్‌రెడ్డి సహా మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు యతి్నస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్‌ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు.
ఆ ఆంతర్యం ఏమిటో?
నియోజకవర్గాల పునరి్వభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి ఎన్నికల్లో దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి పోటీకి ఆ యన ఆసక్తి చూపలేదు. 2014లో ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కారుగుర్తుపై పోటీ చేసిన రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించిన వారు.. రెండోసారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. పోటీ చేసిన వారు ఓటమి పాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభా స్థానాలుండగా, ఆ పార్టీ అధిష్టానం కేవలం చేవెళ్ల లోక్‌సభ స్థానానికే అ భ్యరి్థని ప్రకటించడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు.
అనేక సవాళ్లు
అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అక్కడ బీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల అభ్యరి్థకి అండదండగా నిలిచినప్పటికీ.. కేవలం 268 ఓట్లతోనే బీఆర్‌ఎస్ గట్టెక్కింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్‌ను పక్కన పెట్టి.. ఆయన సొంతంగా పలు కార్యక్రమాలు చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ ఆయన గెలుపునకు కృషి చేస్తారా? అంటే అనుమానమే.
దీనికి తోడు శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో బీజేపీ బలంగా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం జీఓ నంబర్ 111 ఎత్తి వేసినట్లు చెపుతున్నా.. సాంకేతికంగా ఇప్పటికీ జీఓ అమల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మళ్లీ నెగ్గుకొస్తారా? అంటే వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment