Parliament election
-
పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ దూకుడు
-
కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ టూర్లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవనున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. అందరి దృష్టి ఆ సీటుపైనే -
ఘర్ వాపసీ పాలసీకి గాంధీభవన్ సిద్ధం
-
పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ప్లాన్ ఇదే
-
చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజ కవర్గంలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు చెక్‌పెట్టగా, ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆశావహులు పోటీపడుతున్నారు. చేవెళ్ల కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నా యి. ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా ఈ అసెంబ్లీ టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగపడిన పారిజాత నర్సింహారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి అతి సన్నిహితుడైన ఎలుగింటి మధుసూదన్‌రెడ్డి సహా మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు యతి్నస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్‌ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఆ ఆంతర్యం ఏమిటో? నియోజకవర్గాల పునరి్వభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి ఎన్నికల్లో దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి పోటీకి ఆ యన ఆసక్తి చూపలేదు. 2014లో ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కారుగుర్తుపై పోటీ చేసిన రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించిన వారు.. రెండోసారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. పోటీ చేసిన వారు ఓటమి పాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభా స్థానాలుండగా, ఆ పార్టీ అధిష్టానం కేవలం చేవెళ్ల లోక్‌సభ స్థానానికే అ భ్యరి్థని ప్రకటించడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. అనేక సవాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల అభ్యరి్థకి అండదండగా నిలిచినప్పటికీ.. కేవలం 268 ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను పక్కన పెట్టి.. ఆయన సొంతంగా పలు కార్యక్రమాలు చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ ఆయన గెలుపునకు కృషి చేస్తారా? అంటే అనుమానమే. దీనికి తోడు శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో బీజేపీ బలంగా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం జీఓ నంబర్ 111 ఎత్తి వేసినట్లు చెపుతున్నా.. సాంకేతికంగా ఇప్పటికీ జీఓ అమల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మళ్లీ నెగ్గుకొస్తారా? అంటే వేచి చూడాల్సిందే. -
40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే..
నమ్ పెన్: కంబోడియా దేశంలో గత 40 ఏళ్లుగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హున్ సెన్ మరోసారి ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరైన ప్రతిపక్షమే లేని దేశంలో కంబోడియన్ పీపుల్స్ పార్టీ అధినేత హున్ సెన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. ఈ ఆదివారం జులై 23న కంబోడియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నామమాత్రంగా జరిగే ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని హున్ సెన్ మళ్ళీ ఆ పీఠాన్ని అధిష్టించి అత్యధిక కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన ప్రధానిగా రికార్డు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల సంగతి అటుంచితే అక్కడ సరైన ప్రతిపక్షమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ నియంత పాలన కొనసాగుతుందని స్థానికుల్లో ఒకరు తెలిపారు. 2018లో జరిగిన గత ఎన్నికల్లో హున్ సెన్ మొత్తం 125 పార్లమెంటు సీట్లకు గాను 125 సీట్లను గెలుచుకున్నారు. అయితే అప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని బలహీనమైన ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేసి గెలిచారని చెబుతుంటారు. మరికొంత మంది ఆయన రిగ్గింగ్ కు పాల్పడి గెలిచారని చెబుతుంటారు. ఏదైతేనేం చట్టసభల్లో ప్రతిపక్షం లేకుండా ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు హున్ సెన్. నియంత ఖైమర్ రూజ్ తర్వాత కంబోడియా ప్రధానిగా 1985లో బాధ్యతలు చేపట్టిన హున్ సెన్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2013లో ప్రతిపక్షాల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనా 2018లో మాత్రం పూర్తిగా వారి ప్రభావం కనుమరుగైంది. దగ్గరగా నలభై ఏళ్ల హున్ సెన్ పాలనలో కంబోడియా అత్యంత వెనుకబడిన ప్రపంచ దేశాల్లో ఒకటిగా మిగిలింది.1990లో ప్రజాస్వామ్య హోదా దక్కించుకున్న కంబోడియాలో ఈ సారైనా ప్రతిపక్షంలో ఎవరో ఒకరు కూర్చుంటారని ఆశిస్తున్నారు స్థానికులు. ప్రతిపక్షంలో ఎవరు కూర్చున్నా ప్రధానిగా మాత్రం హున్ సెనే పీఠమెక్కనున్నారనేది సుస్పష్టం అంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. ఇది కూడా చదవండి: పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది -
డబ్బుల లెక్క ‘తేలింది’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో పట్టుబడిన డబ్బు లెక్క తేలింది. ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అడ్డగోలుగా డబ్బును వెదజల్లాయి. సగటున ఒక్కో ఓటుకు రూ.2–3 వేల వరకు పంపిణీ చేశాయి. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గంలో సగటున రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని ఓ అనధికారిక అంచనా. మరి అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు, నగదు తరలింపులో ఆంక్షలు విధించి అడుగడుగునా చెక్‌పోస్టులు, తనిఖీలతో హోరెత్తించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బృందాల దాడుల్లో దొరికిన మొత్తం ఎంతో తెలుసా! కేవలం రూ.234.39 కోట్లు. ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లోనే రూ.140.24 కోట్ల నగదు దొరికింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీమొత్తంలో డబ్బు పట్టుబడడం గమనార్హం. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ, పోలీసు నిఘా బృందాల దాడుల్లో పట్టుబడ్డ సొమ్ములో లెక్కలు పక్కాగా చూపిన రూ.50.86 కోట్లను తిరిగి వెనక్కి ఇచ్చేశారు. రూ.20.73 కోట్ల నగదు ఇంకా పోలీసుల అధీనంలోనే ఉంది. ఈ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి వుంది. కాగా, అక్రమంగా నగదు తరలిస్తున్నట్లు తేలినవారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రూ.19.03 కోట్లను కోర్టులో జమ చేశారు. లెక్కలు సరిగా చూపని రూ.41.46 కోట్లను ఆదాయపన్ను శాఖకు బదలాయించారు. సీజ్ చేసిన నగదులో రూ.8.16 కోట్ల మేర నగదును జిల్లా ట్రెజరీల్లో జమ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తగ్గిన డబ్బు ప్రవాహం! శాసనసభ ఎన్నికలతో పోలిస్తే గత నెలలో జరిగిన పార్లమెంటు పోరులో నగదు ప్రవాహం తక్కువగానే కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు రావడంతో విపక్షాల్లో ఊపు తగ్గింది. శాసనసభ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమాతో ఉన్న అధికారపార్టీ కూడా ఖర్చు జోలికి వెళ్లకపోవడంతో వ్యయం భారీగా తగ్గింది. దీంతో ఈ ఎన్నికల్లో సుమారు రూ.94 కోట్లు మాత్రమే పట్టుబడ్డాయి. ఇందులో పోలీసుల దాడుల్లో రూ.43 కోట్లు లభించగా.. ఐటీ అధికారుల సోదాల్లో రూ.50.66 కోట్లు దొరికాయి. నగదు లావాదేవీలపై పరిమితి విధించినప్పటికీ, హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పేరిట డ్రా చేసి తరలిస్తూ పట్టుబడ్డ రూ.8 కోట్ల నగదును సరైన పత్రాలు చూపడంతో ఐటీ శాఖ తిరిగి వెనక్కి ఇచ్చేసింది. -
లోక్‌సభకు పోటీ చేస్తా
సాక్షి, హైదరాబాద్: తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తానని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వెల్లడించారు. అయితే, ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని, ఎక్కడి నుంచి పోటీచేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దొడ్డిదారిన గెలిచారని విమర్శించారు. వీవీప్యాట్లను లెక్కించాలని తాము కోరుతున్నామని, కాలం గడిచేకొద్దీ సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము వేసిన పిటిషన్‌పై వీవీ ప్యాట్ల వివరాలు ఐదేళ్లు ఉంటాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారని, దీనిపై వచ్చేనెల 7లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు చెప్పిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు ఓట్ల కూల్చివేత కూడా జరిగిందని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పో -
పాక్‌లో ఇమ్రాన్‌కు షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఉపఎన్నికలు ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ ఇచ్చాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి పార్లమెంట్లో తన బలాన్ని‡ పెంచుకుంది. జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ ఐదు చోట్ల పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఇమ్రాన్ గెలుపొందిన నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. లాహోర్, బన్ను స్థానాల్లో పీటీఐకి ఓటమి ఎదురైంది. పాక్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎన్ఏ–124 లాహోర్ స్థానంలో పీటీఐ అభ్యర్థిపై సునాయాసంగా గెలుపొందారు. పీఎంఎల్–నవాజ్, పీటీఐలు చెరో నాలుగు జాతీయ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నాయని పాక్ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. -
మున్సిపల్ ఫలితాలు నేడే
-
మున్సిపల్ ఫలితాలు నేడే
మున్సిపల్ ఫలితాలు నేడే మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడి: రమాకాంత్‌రెడ్డి కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాతే పురపాలక చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక మొత్తం 513 డివిజన్లు, 3,931 వార్డులకు ఓట్ల లెక్కింపు.. 155 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు 8,000 మంది సిబ్బంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు మార్చి 30వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 145 మున్సిపాలిటీలు, 10 మునిసిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఫలితాలు వెల్లడైనప్పటికీ.. పురపాలక సంఘాలకు కొత్త పాలక మండళ్లు జూన్ ఐదో తేదీ తరువాత మాత్రమే ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 16న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే.. మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, వైస్-చైర్పర్సన్లు; కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నందున, వారి హక్కును కాపాడాల్సిన బాధ్యత కమిషన్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత నెలన్నర రోజులుగా ఈవీఎంలకు గట్టి భద్రత కల్పించామని, ఎక్కడా ఇబ్బందులులేవని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరగని తొమ్మిది కార్పొరేషన్లు, 17 మునిసిపాలిటీలకు రెండో దశలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలను రమాకాంత్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వివరించారు. ముఖ్యాంశాలివీ... 145 మునిసిపాలిటీల్లో మొత్తం 3,970 వార్డులు ఉండగా.. అందులో 39 వార్డులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 3,931 మునిసిపల్ వార్డులకు, 10 కార్పొరేషన్లలో 513 డివిజన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మునిసిపల్ ఎన్నికలకు దాదాపు 9,500 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడారు. ఓట్ల లెక్కింపుకు 8,000 మంది సిబ్బందిని నియమించారు. 65 ప్రాంతాల్లోని 155 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెవెన్యూ డివిజన్, డీఎస్పీ కార్యాలయ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరిస్తారు. ఫలితాలపై ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. ఓట్ల లెక్కింపు తరువాత ఈవీఎంలను భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాదేశిక ఓట్ల లెక్కింపు 2,099 కేంద్రాల్లో మండల, జిల్లాపరిషత్ ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఈ నెల 13వ తేదీన 2,099 కేంద్రాల్లో చేపడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. 1,096 జడ్పీటీసీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఒక స్థానం ఏకగ్రీవం కాగా, రెండు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికలు జరిగిన 1,093 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. అలాగే 16,589 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చినా 346 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 19 స్థానాల్లో ఎవరూ నామినేషనుల దాఖలు చేయకపోవడం, మరో ఆరు స్థానాలపై కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు. మంగళవారం 16,214 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కమిషనర్ వివరించారు. ఓట్ల లెక్కింపుకు 15,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
‘సిట్టింగ్’ మంత్ర!
= వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యత = జాక్‌పాట్ కొట్టిన సీనియర్లు = అసమ్మతి అరికట్టడానికి కేపీసీసీ నిర్ణయం? సాక్షి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం పార్టీలోని సీనియర్ నేతలకే కట్టబెట్టాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. అందులోనూ సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యత కల్పించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు సమయంలో తలెత్తే అసమ్మతిని సాధ్యమైనంత వరకూ తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఎంపీలు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇందులో మండ్య ఎంపీ రమ్య, బెంగళూరు గ్రామీణ ఎంపీ సురేష్‌కుమార్ తప్ప మిగిలిన వారంతా సీనియర్ నాయకులే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకపై ఆ పార్టీ అధిష్టానం ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవడానికి అనుసరించాల్సిన ‘రోడ్‌మ్యాప్’ను తయారు చేసి అందించాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర నాయకులకు సూచించారు. ఈ క్రమంలో పార్టీ నుంచి ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారికే ఆయా స్థానాల్లో తిరిగి టికెట్టు కేటాయించాల్సిందిగా కేపీసీసీ పదాధికారుల సమావేశంలో తీర్మానించినట్లు సమాచారం. ఇదే తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో మల్లికార్జున ఖర్గే (గుల్బర్గ), ధరంసింగ్ (బీదర్), విశ్వనాథ్ (మైసూరు), ధృవనారాయణ (చామరాజనగర), వీరప్పమొయిలీ (చిక్కబళాపుర), మునియప్ప (కోలారు), కె.జయప్రకాష్ హెగ్డే (ఉడుపి-చిక్కమగళూరు)లను వ చ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదేస్థానం నుంచి బరిలోకి దించాలని కేపీసీసీ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానాల్లో కూడా ఈసారి సీనియర్లకే టికెట్టు కేటాయించాలనే ప్రాథమిక నిర్థారణకు రాష్ట్ర నాయకులు వచ్చారు. ఉత్తర కన్నడ పార్లమెంటు స్థానం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీపడుతున్నారు. ఈ టికెట్టు ఎలాగైనా తమ కుమారులైన ప్రశాంత్ దేశ్‌పాండే, నివేదిత్ అల్వాలకు ఇప్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్టు ఇచ్చినా మరొకరు అసంత ృప్తికి లోనయ్యే తెరవెనక రాజకీయాలు నడిపి పార్టీ అభ్యర్థినే ఓడించే అవకాశం లేకపోలేదని కేపీసీసీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో ఈ సీటును పార్టీలో సీనియర్ నాయకుడైన హరిప్రసాద్‌కు కేటాయిస్తే మంచిదనే అభిప్రాయానికి రాష్ట్ర నాయకులు వచ్చినట్లు తెలిసింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఈడిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నందున అదే వర్గానికి చెందిన హరిప్రసాద్‌కు టికెట్టు కేటాయించడం ఉత్తమమని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ కన్నడ ఎంపీ టికెట్‌ను మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నాయకుడైన బి.జనార్థన పూజారికి ఇవ్వాలని కేపీసీసీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ స్థానానికి కేంద్రమంత్రి మొయిలీ కుమారుడైన హర్ష మొయిలీ పోటీ పడుతున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన జనార్థన పూజారి వైపే రాష్ట్ర నాయకులు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. బళ్లారి నుంచి సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడైన ఎన్.వై హనుమంతప్పకు టికెట్టు కేటాయించాలని కేపీసీసీ నిర్ధారణకు వచ్చింది. మండ్యలో ఎస్.ఎం కృష్ణను బరిలో దించాలని రాష్ట్రనాయకులు భావిస్తున్నా ఆయన నిరాకరించడంతో ప్రస్తుత ఎంపీ రమ్యకే తిరిగి టికెట్టు కేటాయించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఉప ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే (జూనియర్ అయినా కూడా) బెంగళూరు గ్రామీణ పార్లమెంటు స్థానాన్ని ప్రస్తుత ఎంపీ సురేష్కుమార్కే కేటాయించాలని కేపీసీసీ నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈనెల 29, 30 తేదీల్లో బెంగళూరులో జరిగే సమావేశంలో ఈ విషయమై ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఢిల్లీ పెద్దలకు లోక్‌సభ అభ్యర్థుల ప్రాథమిక జబితాను కేపీసీసీ పంపించనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొననున్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రమణ సూచిం చారు. తిరువళ్లూరు జిల్లా పూండిలో ఉచిత వైద్యశిబిరం, నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ చైర్మన్ అమ్ము మాధవన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి రమణ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే పథకాలు ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు. నిరుపేదలకు అన్ని విధాల అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. వందశాతం మంది ప్రజలకు ఏదో రూపంలో సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని సూచించారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్షపాతం లేకుండా అమలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఇప్ప టి వరకు దాదాపు 35 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలను వర్తింపజేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను సరైన రీతిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎంపీ వేణుగోపాల్, జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, తిరువళ్లూరు కలెక్టర్ వీరరాఘవరావు, ఎమ్మెల్యే రాజా పాల్గొన్నారు.