
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ టూర్‌లో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అవనున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment