chevella Parliament
-
చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజ కవర్గంలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు చెక్‌పెట్టగా, ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆశావహులు పోటీపడుతున్నారు. చేవెళ్ల కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నా యి. ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా ఈ అసెంబ్లీ టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగపడిన పారిజాత నర్సింహారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి అతి సన్నిహితుడైన ఎలుగింటి మధుసూదన్‌రెడ్డి సహా మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు యతి్నస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్‌ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఆ ఆంతర్యం ఏమిటో? నియోజకవర్గాల పునరి్వభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి ఎన్నికల్లో దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి పోటీకి ఆ యన ఆసక్తి చూపలేదు. 2014లో ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కారుగుర్తుపై పోటీ చేసిన రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించిన వారు.. రెండోసారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. పోటీ చేసిన వారు ఓటమి పాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభా స్థానాలుండగా, ఆ పార్టీ అధిష్టానం కేవలం చేవెళ్ల లోక్‌సభ స్థానానికే అ భ్యరి్థని ప్రకటించడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. అనేక సవాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల అభ్యరి్థకి అండదండగా నిలిచినప్పటికీ.. కేవలం 268 ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను పక్కన పెట్టి.. ఆయన సొంతంగా పలు కార్యక్రమాలు చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ ఆయన గెలుపునకు కృషి చేస్తారా? అంటే అనుమానమే. దీనికి తోడు శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో బీజేపీ బలంగా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం జీఓ నంబర్ 111 ఎత్తి వేసినట్లు చెపుతున్నా.. సాంకేతికంగా ఇప్పటికీ జీఓ అమల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మళ్లీ నెగ్గుకొస్తారా? అంటే వేచి చూడాల్సిందే. -
‘వారసుల’ పోరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా రాజకీయాల్లో కొత్త వ్యక్తులు కావడం.. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నేతల వారసులు కావడంతో పోటీ రసకందాయంలో పడింది. తెలుగుదేశం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు టి.వీరేందర్ బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అటు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కొండా వెంకటరంగారెడ్డి వారసుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో నిలిచారు. రాజకీయాల్లో ఈ ముగ్గురివీ కొత్త ము ఖాలే. పోటీ చేస్తున్న ఈముగ్గురు అభ్యర్థుల నే పథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వారిరువురూ అన్నాతమ్ముళ్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన కొండా రాఘవరెడ్డి, టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇరువురూ ఒకే మాజీ హోంమంత్రుల సుపుత్రులు.. తరగతిలో దోస్తులు.. తూళ్ల వీరేందర్‌గౌడ్ తండ్రి టి.దేవేందర్‌గౌడ్ మాజీ హోంమంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు కార్తీక్‌రెడ్డి తల్లితండ్రులిద్దరూ హోంమంత్రులుగా పదవులు ఏలినవారే. అంతేకాక.. వీరేందర్, కార్తీక్‌లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆబిడ్స్ లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో ఇద్దరిదీ ఒకే తరగతి కావడం విశేషం. తాజాగా ఈ ఇరువురూ ఒకే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం విశేషం. -
జైపాల్‌రెడ్డికే మళ్లీ చేవెళ్ల టికెట్
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి మళ్లీ పోటీచేసే అవకాశం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక మోడల్ స్కూల్లో లీడ్ఇండియా ఆధ్వర్యంలో టీచర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను మళ్లీ జైపాల్‌రెడ్డికే ఇచ్చేందు కు సుముఖంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఒకవేళ ఆయన పోటీ చేయటానికి నిరాకరిస్తే తప్ప మరొకరికి అవకాశం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. జైపాల్‌రెడ్డి తిరిగి పోటీచేసే అవకాశం ఉన్నందువల్లే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పరిశీలకుల ముందు ఆశావహులు చాలామంది దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు. కొంతమంది డబ్బున్న నాయకులు పదవులకోసం ఆరాట పడుతున్నారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలను చూస్తే అవగతమవుతోందని ఆయన స్పష్టంచేశారు. అవినీతిపరులకు, పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇవ్వరాదని అధిష్టానం ఇప్పటికే నిర్ణయించిందని ఆయన గుర్తుచేశారు. లీడ్ఇండియా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లీడ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్లు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. టీచర్లకు నిర్వహించిన లీడ్ఇండియా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 20శాతం మంది యువతను మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సమాజం లోని కుళ్లును ప్రక్షాళన చేయటానికి యువతరం నడుం బిగించాలని ఆయన పిలుపుని చ్చారు. సేవకులనే నాయకులుగా ఎన్నుకుంటే సమాజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. -
జైపాల్‌రెడ్డి పోటీచేస్తే స్వాగతిస్తాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పోటీచేస్తే స్వాగతిస్తామని మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని మార్కెట్‌యార్డులో శుక్రవారం చైర్మన్ మలిపెద్ది వెంకటేశంగుప్త అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలోని కాంగ్రెస్‌పార్టీ సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ జైపాల్‌రెడ్డి మరోమారు పోటీచేయాలని భావిస్తే అందరం స్వాగతిస్తామని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. ఆయన పోటీచేయకుంటే తాను తప్పనిసరిగా బరిలో ఉంటానన్నారు. జైపాల్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్య నాయకుల ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయన్నారు. వచ్చేనెల 5వతేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర పునర్మిర్మాణ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నగర శివార్లలోని ఆర్మీ మైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ మీదుగా తాండూరు వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఎన్నికైన సర్పంచులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. చేవెళ్ల సర్పంచ్ ఎం.నాగమ్మబాల్‌రాజ్, రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశంగుప్త, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ఇంద్రన్న యువసేన జిల్లా అధ్యక్షుడు జి.రవికాంత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ఎం.బాల్‌రాజ్, పర్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ శివానందం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.యాదగిరి తదితరులు మాట్లాడారు. చేవెళ్ల ఎంపీ టికెట్‌ను దివంగత మాజీ హోంమంత్రి పి.ఇంద్రారెడ్డి వారసుడు కార్తీక్‌రెడ్డికి కేటాయిస్తేనే విజయం తథ్యమని పేర్కొన్నారు. కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. మార్కెట్‌కమిటీ డెరైక్టర్లు ఎండీ అలీ, మాధవగౌడ్, పార్వతమ్మ, సర్పంచులు అనురాధ, నాగమ్మ, స్వర్ణ, స్వరూప, అనుసూజ, శశికళ, శ్రీనివాస్‌గౌడ్, జంగారెడ్డి, గోపాల్‌రెడ్డి, వెంకటనర్సింహు లు, హన్మంత్‌రెడ్డి, శ్యామలయ్య, జంగ య్య, మాజీ సర్పంచులు పి.ప్రభాకర్, ఎం.సరస్వతి, నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్, అమర్నాధ్రెడ్డి, వనం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.