చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి మళ్లీ పోటీచేసే అవకాశం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక మోడల్ స్కూల్‌లో లీడ్‌ఇండియా ఆధ్వర్యంలో టీచర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను మళ్లీ జైపాల్‌రెడ్డికే ఇచ్చేందు కు సుముఖంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.
ఒకవేళ ఆయన పోటీ చేయటానికి నిరాకరిస్తే తప్ప మరొకరికి అవకాశం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. జైపాల్‌రెడ్డి తిరిగి పోటీచేసే అవకాశం ఉన్నందువల్లే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పరిశీలకుల ముందు ఆశావహులు చాలామంది దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు. కొంతమంది డబ్బున్న నాయకులు పదవులకోసం ఆరాట పడుతున్నారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలను చూస్తే అవగతమవుతోందని ఆయన స్పష్టంచేశారు. అవినీతిపరులకు, పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇవ్వరాదని అధిష్టానం ఇప్పటికే నిర్ణయించిందని ఆయన గుర్తుచేశారు.
లీడ్‌ఇండియా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లీడ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్లు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. టీచర్లకు నిర్వహించిన లీడ్‌ఇండియా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 20శాతం మంది యువతను మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సమాజం లోని కుళ్లును ప్రక్షాళన చేయటానికి యువతరం నడుం బిగించాలని ఆయన పిలుపుని చ్చారు. సేవకులనే నాయకులుగా ఎన్నుకుంటే సమాజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.
జైపాల్‌రెడ్డికే మళ్లీ చేవెళ్ల టికెట్
Published Mon, Feb 10 2014 12:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement