మైసమ్మ సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి | Supreme Court Judge Visits Gandi Maisamma Temple At Rangareddy District | Sakshi
Sakshi News home page

మైసమ్మ సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

Published Sun, Dec 29 2019 2:29 AM | Last Updated on Sun, Dec 29 2019 7:36 AM

Supreme Court Judge Visits Gandi Maisamma Temple At Rangareddy District - Sakshi

కడ్తాల్‌: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలో వెలసిన మైసిగండి మైసమ్మ తల్లిని శనివారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ చైర్మన్‌ శిరోలీ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement