రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
వికారాబాద్: రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పెద్దులూరు గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పద్మమ్మ(38) వ్యవసాయ పనులకు కోసం వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.