ఔటర్ రింగ్‌రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న డీసీఎంను ఓవర్‌టేక్ చేసే క్రమంలో టాటాఏస్ దాన్ని ఢీకొట్టడంతో.. రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటన మహేశ్వరం మండలం తుక్కుగూడలోని పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి ఘన్‌పూర్‌కు కుర్చీల లోడుతో వెళ్తున్న డీసీఎం పటాన్‌చెరు నుంచి రామోజీఫిల్మ్ సిటి వైపు వస్తున్న టాటాఏస్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన హైవే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.