
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓఆర్ఆర్‌పై వేగంగా వచ్చిన ఇనోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని వెనుకను నుంచి ఢీ కొట్టింది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇనోవా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను కుత్బుల్లాపూర్‌కు చెందిన డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు శామీర్ పేట పోలీసులు పేర్కొన్నారు.
బిజినెస్‌లో భాగస్వామ్యులు అయిన నలుగురు కలిసి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని ఇన్నోవా కారులో తిరి ప్రయాణమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోపే ఈ ప్రమాదం సంభవించింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు షామీర్‌పేట్ ఓఆర్‌ఆర్‌పై అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని వెనక నుంచి గుద్దుకుంది. దైవ దర్శనానికి వెళ్లి ఇద్దరు మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment