
క్రైమ్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో దారుణం జరిగింది. కొత్త కాపురంలో కలహలతో ఓ వ్యక్తి భార్యను చంపేశాడు. ఆపై పారిపోతుండగా లారీ యాక్సిడెంట్ అయ్యి.. అక్కడిక్కడే కన్నుమూశాడు.
నాలుగు నెలల కిందట దీప్య, అరుణ్‌ల వివాహం జరిగింది. కారణం తెలియదుగానీ కొంతకాలంగా వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అరుణ్.. దీపను హతమార్చాడు. ఆపై బైక్‌పై పారిపోతుండగా ఆగి ఉన్న లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అయితే భార్యను చంపి లొంగిపోయే క్రమంలోనే అరుణ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అతని తరపు బంధువులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment