మండలంలోని చీటూరులో పురుగుల మందు తాగిన ఓ మహిళ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందింది. చీటూరుకు చెందిన కేమిడి లక్ష్మి(55) భర్త గట్టయ్యకు పక్కపొలానికి చెందిన వాసర్ల ఐలయ్యతో గెట్టు విషయంలో జూలై 29న పంచాయితీ జరిగింది.
చికిత్స పొందుతూ మహిళ మృతి
Aug 2 2016 8:03 PM | Updated on Sep 4 2017 7:30 AM
చీటూరు(లింగాలఘణపురం) : మండలంలోని చీటూరులో పురుగుల మందు తాగిన ఓ మహిళ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందింది. చీటూరుకు చెందిన కేమిడి లక్ష్మి(55) భర్త గట్టయ్యకు పక్కపొలానికి చెందిన వాసర్ల ఐలయ్యతో గెట్టు విషయంలో జూలై 29న పంచాయితీ జరిగింది.
ఈ క్రమంలోనే వాసర్ల ఐలయ్య అతడి కుటుంబ సభ్యులు లక్ష్మి, రాంచంద్రు, అండమ్మ, అనిల్, బీరయ్య, రేణుక, శ్రీకాంత్ 30న వచ్చి ఇంట్లో ఉన్న లక్ష్మిని తీవ్ర పదజాలంతో దూషించడంతో ఆమె మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఏఎస్సై పురుషోత్తంరెడ్డి తెలిపారు. లక్ష్మి ఆత్మహత్యకు కారణమైన అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందిపై 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement