![Young Woman Committed Suicide At Kukatpally - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/19/vijayalaxmi.jpg.webp?itok=lQmpulpJ)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్‌లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. అయితే, తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా.. వివాహం మాత్రం కావడంలేదని జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందతూ విజయ లక్ష్మి గురువారం మృతి చెందింది.
ఇది కూడా చదవండి: ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..?
Comments
Please login to add a commentAdd a comment