సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని గౌతమ్ నగర్ కాలనీలో ఓ నిర్మాణ సంస్థ పనులు చేస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీనితో స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరైన అనుమతులు భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి సెల్లార్ కోసం తవ్వడంతో పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయింది. కనీసం కాలనీ వాసులు బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆందోళన చేపట్టారు.
అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్‌కి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు కార్పొరేటర్ కి సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే కూలగొట్టే జీహెచ్ఎంసీ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం
Comments
Please login to add a commentAdd a comment