సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి.. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే యజమాని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే కార్మికుల ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది ఇప్పుడు.
కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో గోడతో పాటు సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో.. భవనం 6వ అంతస్థు నుంచి కిందపడిపోయారు కార్మికులు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
పిట్టగోడ పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పిట్టగోడతో పాటు గోవా కరలు(పిరంగి ) విరిగి కిందపడ్డారు. మృతుల్ని ఒడిశాకు చెందిన సంతోష్, సోనియాచరణ్‌గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.
అయితే భవన నిర్మాణానికి అనుమతులు ఐదు అంతస్థుల వరకే ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా ఆరో అంతస్థు నిర్మించి పనులు జరుపుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment