ముజఫర్‌నగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి బీఎస్‌ఎఫ్ జవాను రేప్‌చేయడంతో ఓ యువతి(26) విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యూపీలో జరిగింది. ఆత్మహత్య ఘటనపై కొత్వాలి ఎస్‌హెచ్‌వో అనిల్ కపేర్వాన్ మాట్లాడారు. బాధితురాలు జూలై 6న విషం తాగగా, చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయిందని చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బీఎస్‌ఎఫ్ జవాను తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. బాధితురాలిపై లైంగికదాడిని వీడియో తీసిన నిందితుడు పెళ్లి ప్రస్తావన తెస్తే ఈ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తానని ఆమెను బెదిరించేవాడని తండ్రి ఫిర్యాదుచేశాడు. జవాను వేధింపుల్ని తట్టుకోలేక సదరు యువతి ప్రాణాలు తీసుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment