ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న భారతి సిమెంట్ | Bharathi Cement to Excellence Award | Sakshi
Sakshi News home page

ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న భారతి సిమెంట్

Published Sun, Jan 25 2015 6:24 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న భారతి సిమెంట్ - Sakshi

ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న భారతి సిమెంట్

సాక్షి, చెన్నై: భారతి సిమెంట్‌కు ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీంద్రరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కన్‌స్ట్రక్షన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ - 2014 కార్యక్రమం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో శనివారం రాత్రి జరిగింది. దీనికి గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. నిర్మాణ రంగంలో ప్రతిభ చూపిన 34 సంస్థలకు, ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశారు.

విరివిగా మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతున్న తమిళ హాస్య నటుడు వివేక్‌కు గ్రీన్ గ్లోబ్ అవార్డును ప్రదానం చేశారు. భారతి సిమెంట్‌కు ఎక్సలెన్సీ ఇన్ హైటెక్ సిమెంట్ టెక్నాలజీ అవార్డును అందచేశారు. నిర్మాణ రంగంలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement